AP High Court : జీవో నెంబర్ వన్ ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

రాజకీయ పార్టీలు రోడ్ షోలు (Road Shows), సభలు నిర్వహించకుండా

రాజకీయ పార్టీలు రోడ్ షోలు, సభలు నిర్వహించకుండా ఏపీలోని వైసీపీ (YCP) ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో (AP High Court) పిటిషన్ వేశారు. పిటిషన్ ను నేడు విచారించిన హైకోర్టు జీవో నెంబర్ వన్ ను సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రామకృష్ణ తరపున అశ్వినీ కుమార్ వాదనలను వినిపించారు. ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని ఆయన వాదించారు. బ్రిటిష్ కాలంనాటి చట్టాన్ని తీసుకొచ్చారని, అప్పుడు కూడా లేని నిబంధనలను ఇప్పుడు విధించారని చెప్పారు. ఈ జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఈ సందర్భంగా హైకోర్టు (AP High Court) వ్యాఖ్యానించింది. ఈ నెల 23వ తేదీ వరకు జీవోపై సస్పెన్షన్ విధించింది. తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది.

రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ఈ జీవో అన్ని పార్టీలకు వర్తిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారని… ఆ మరుసటి రోజే రాజమండ్రిలో జగన్ రోడ్ షో నిర్వహించారని, ఆ తర్వాత ప్రతి రోజూ వైసీపీ నేతలు రోడ్ షోలను నిర్వహిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రజల హక్కులను హరించడానికే ఈ జీవోను తీసుకొచ్చారని అన్నారు.

Also Read:  Keerthy Suresh : స్విమ్మింగ్‌పూల్‌లో.. కీర్తి సురేష్ వైరల్ ఫొటోస్