ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏపీ హైకోర్టు లో చంద్రబాబు పిటిషన్ల (Chandrababu Petitions) ఫై విచారణ జరగనుంది. మూడు కేసుల్లో దాఖలైన పిటీషన్లపై విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case) , క్వాష్ పిటిషన్ (Quash Petition), రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు (Amaravathi Inner Ring Road Case) కు సంబంధించి పిటిషన్ల ఫై హైకోర్ట్ , ఏసీబీ కోర్ట్ లలో విచారణ జరగనుంది.
చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దంటూ దాఖలు చేసిన పిటీషన్ తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అవకతవకల కేసులో ముందస్తు బెయిల్ పై విచారణ చేపట్టనుంది ధర్మాసనం. ఈ పిటీషన్లపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరోపక్క చంద్రబాబు అరెస్టుపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు భగ్గుమంటున్నాయి. అన్నివర్గాల ప్రజలు చంద్రబాబు అరెస్టును తప్పుపడుతున్నారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు అక్రమ అరెస్టును ఖండిస్తున్నారు.
Read Also : Ambani & Disney India : అంబాని చేతుల్లోకి డిస్నీ ఇండియా..?
విదేశాల్లోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు తెలుగు ప్రజలు ఆందోళనలు చేపడుతూ వస్తున్నారు. వియ్ ఆర్ విత్ సీబీఎన్ అంటూ చంద్రబాబుకు మద్దతుగా పలుకుతున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ… భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నల్ల దస్తులు ధరించి నిరసనలో పాల్గొన్నారు. న్యాయం కావాలి… చంద్రబాబు విడుదల కావాలంటూ… నినాదాలు హోరెత్తించారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వేల మంది తెలుగు ప్రజలు బయటికి వచ్చి వీధుల్లో ర్యాలీ చేశారు. బెల్జియం దేశంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మేము సైతం బాబు గారికి తోడుగా’ కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ బ్రసెల్స్ నగరం అటోమియం ముందు నిరసన నిర్వహించారు.