Site icon HashtagU Telugu

AP Govt ties: IIT మద్రాస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు

Ap Govt Ties Up With Iit Ma

Ap Govt Ties Up With Iit Ma

AP Govt ties with IIT Madras : 8 విభాగాలకు సంబంధించి సాంకేతికత, పరిశోధనల ఫలితాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా IIT మద్రాస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అమరావతిలో డీప్ టెక్ పరిశోధన, స్కిల్ డెవలప్మెంట్లో నాణ్యత పెంచేలా సహకారం తీసుకోనుంది.

విద్యాశాఖ, IT, పరిశ్రమలు, క్రీడలు, RTGS అంశాల్లోనూ ప్రభుత్వం ఆ సంస్థతో కలిసి పనిచేయనుంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేలా ఇరు పార్టీల నడుమ ఒప్పందం అలాగే విమానాశ్రయాలను లాజిస్టిక్స్/ మెయింటెనెన్స్ హబ్‌లుగా మార్చే లక్ష్యంతో ఇన్వెస్టిమెంట్ అండ్ ఇన్ ఫ్రాస్ట్చక్చర్ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.

1. ఐఐటీఎం – ఏపీ సీఆర్డీఏ

అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహా కోసం ఈ ఒప్పందం కుదిరింది. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఫిజికల్, వర్చువల్ పద్ధతుల్లో ఐఐటీఎం సంస్థ ప్రభుత్వంతో కలసి పనిచేస్తుంది.

2. ఐఐటీఎం – ఏపీ మారిటైమ్ బోర్డు

సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం ఐఐటీఎం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుమ ఒప్పందం కుదిరింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పరిశోధన తోపాటు కన్సల్టెన్సీ, విద్య, శిక్షణ ప్రయోజనాలను సాధించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.

3. ఐఐటీఎం – ఏరీ స్కిల్ డెవలప్‌మెంట్

స్వయం ప్లస్, ఐఐటీఎం ప్రవర్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్‌ఫాంల ద్వారా.. స్కేల్ స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

4). ఐఐటీఎం – ఏపీ విద్యాశాఖ

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఐఐటీఎం ప్రవర్తక్ విద్యాశక్తి ద్వారా ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఐఐటీఎం సాంకేతిక శిక్షణ ఇస్తుంది. ఇందుకు అవసరమైన మార్గదర్శక కార్యక్రమాలను ప్రారంభిస్తుంది.

5). ఐఐటీఎం – ఇన్వెస్ట్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్చక్చర్

విమానాశ్రయాలను లాజిస్టిక్స్, మెయింటెనెన్స్ హబ్‌లుగా మార్చే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ముఖ్యంగా కుప్పం, పుట్టపర్తి విమానాశ్రయాలపై దృష్టిసారించడం, ఆయా ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేయడం ఈ ఒప్పందం లక్ష్యం.

6. ఐఐటీఎం – ఐటీ శాఖ

అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను ఉపయోగించి.. విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్‌వేగా అభివృద్ధి చేయడం. తద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ డేటా కనెక్టివిటీని మెరుగుపరచడం కోసం ఈ ఒప్పందం చేసుకున్నారు.

7. ఐఐటీఎం – ఆర్టీజీఎస్

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డాటా సైన్స్ రంగాల్లో సాఫ్ట్ వేర్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఐఐటీఎం ప్రవర్తక్‌తో ఏపీ ఆర్టీజీఎస్ కలిసి పనిచేస్తుంది.

8. ఐఐటీఎం – క్రీడల శాఖ

అమరావతి రాజధానిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు.. ఐఐటీఎం ద్వారా సాంకేతిక సలహాలు పొందేందుకు ఈ ఒప్పందం కుదుర్చకున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ఈ ఒప్పందం ఉపయోగపడనుంది.

Read Also : Mahesh Athidhi : ‘అతిధి’ మళ్లీ వస్తున్నాడు