Big Pushpas : కొందరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు పుష్పను మించిన రేంజులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం దగ్గరున్నా ఎర్రచందనం నిల్వల కన్నా, ఆయా స్మగ్లర్ల గోదాముల్లో సీక్రెట్‌గా దాచిన స్టాకే ఎక్కువని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్ విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఏపీలోని తిరుపతి పరిధిలో తిమ్మినాయుడుపాలెం వద్దనున్న ఎర్రచందనం సెంట్రల్ గోదాములో దాదాపుగా 5,400 టన్నుల ఎర్రచందనం నిల్వ ఉంది. దీనికంటే ఎన్నోరెట్లు ఎక్కువ స్టాక్ స్మగ్లర్ల వద్ద ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని రహస్య స్థావరాల్లో ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు దాచారని తెలుస్తోంది.
Also Read :Vijayasai Reddy : వైసీపీలో విజయసాయిరెడ్డి ప్లేస్ ఆ యువనేతకేనా ? జగన్ నిర్ణయంపై ఉత్కంఠ
ఏపీ టాస్క్‌ఫోర్స్ వలకు దొరికిపోతున్నారు
- కరోనా సమయంలో అలుముకున్న ఆర్థిక సంక్షోభం నుంచి చైనాలోని పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అందుకే అక్కడి నుంచి ఎర్రచందనం కోసం భారతదేశంలోని స్మగ్లర్లకు ఆర్డర్లు వస్తున్నాయట. ఈవిషయాన్ని ఏపీ ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్ విభాగం గుర్తించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని రహస్య స్థావరాల్లో దాచిన ఎర్రచందనం దుంగలను బయటికి తీస్తున్నారట. వాటిని వివిధ రహస్య మార్గాల్లో స్మగ్లింగ్ చేస్తున్నారని గుర్తించారు.
- ఇటీవలే ఏపీ టాస్క్‌ఫోర్స్‌కు స్మగ్లర్లు రాంప్రసాద్, రవిశంకర్(Big Pushpas) దొరికిపోయారు. వారిని విచారించగా ఎర్రచందనం స్మగ్లింగ్‌తో ముడిపడిన చాలా విషయాలను వెల్లడించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా టాస్క్‌ఫోర్సు అధికారులు సోదాలు చేసి రూ.3.5 కోట్లు విలువైన 155 దుంగలను రహస్య స్థావరాల నుంచి స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన ఉత్తంకుమార్, నందకిశోర్, సోనీ, జోషి హన్స్‌రాజ్, మీర్జాయి, పరేష్‌జి అనే అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.
- తమిళనాడులోని ఓ గోదాములో దాచిన ఎర్రచందనాన్ని అసోంకు తరలిస్తుండగా ఏపీ టాస్క్‌ఫోర్సు సిబ్బంది చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో పట్టుకున్నారు. అక్కడ స్వాధీనం చేసుకున్న 413 ఎర్రచందనం దుంగల విలువ రూ.4.5 కోట్లు ఉంటుంది. తమిళనాడుకు చెందిన నరేంద్రకుమార్, అసోంకు చెందిన బినోయ్‌కుమార్, రాజస్థాన్‌కు చెందిన విజయ్ జోషీని అదుపులోకి తీసుకున్నారు.
Also Read :Red Light Therapy: రెడ్ లైట్ థెరపీ అంటే ఏమిటి? ఈ చికిత్స దేనికి ఉపయోగిస్తారు?
భారత్ ఎర్రచందనంతో చైనాలో ఏం చేస్తారు ?
కరోనా సమయంలో అలుముకున్న ఆర్థిక సంక్షోభం నుంచి చైనాలోని పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అందుకే అక్కడి నుంచి ఎర్రచందనం కోసం భారతదేశంలోని స్మగ్లర్లకు ఆర్డర్లు వస్తున్నాయట. భారత్‌లో లభించే ఎర్రచందనాన్ని ప్రధానంగా చైనాకు స్మగ్లింగ్ చేస్తుంటారు. ఎందుకంటే.. అక్కడ దానితో ఫర్నీచర్, బొమ్మలు, వస్తువులు తయారు చేస్తారు. వాటిని జపాన్, థాయ్‌లాండ్, మలేషియా దేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ దేశాలను అవి ఐరోపా దేశాలకు చేరుతుంటాయి. ఐరోపా దేశాలకు చేరే సరికి.. ఎర్రచందనంతో తయారు చేసిన ఆయా సామగ్రి ధర అమాంతం పెరిగిపోతుంటుంది. అందుకే అంత రేంజులో ఎర్రచందనానికి ధర పలుకుతుంటుంది. కిలోకు దాదాపు రూ.6వేలకు ఎర్ర చందనాన్ని విక్రయిస్తుంటారు. భారీ సైజులో ఉండే ఒక ఎర్ర చందనం దుంగ ధర దాదాపు రూ.20 లక్షల దాకా ఉంటుందట.