Site icon HashtagU Telugu

NTR Bharosa: వైఎస్సార్ పెన్షన్ కానుక పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్పు

NTR Bharosa

NTR Bharosa

NTR Bharosa: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వంలో సంస్కరణలు తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో వైఎస్సార్ పెన్షన్ కానుక పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చింది. అంతే కాకుండా లబ్ధిదారులకు పెన్షన్లను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ట్రాన్స్‌జెండర్లకు పెన్షన్ పెంపు వర్తిస్తుంది.

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం పెన్షన్ మొత్తాన్ని రూ. 3,000 నుండి అర్హులైన గ్రహీతలకు 4,000 పెంచారు. దివ్యాంగులకు ప్రస్తుతం 3వేలు ఇస్తుండగా జులై నెల నుంచి రూ. 6వేలు అందివ్వనున్నారు. ఇక వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ట్రాన్స్‌జెండర్లకు 4వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

వాస్తవానికి 2014 -2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ పథకాన్ని ప్రవేశ పట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా మార్చేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చింది. కాగా ఆంధ్రప్రదేశ్ లో 65.39 లక్షల మంది పింఛన్ దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

Also Read: Prabhas Kalki Promotions : కల్కి పేరు దేశం మొత్తం మారుమోగేలా.. నాగ్ అశ్విన్ ప్రమోషనల్ ప్లాన్ అదుర్స్..!