Site icon HashtagU Telugu

Skill Development Scam: చంద్రబాబు బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం

Skill Development Scam

Skill Development Scam

Skill Development Scam: టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది. బెయిల్ మంజూరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలని నిశ్చయించుకుంది.

ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్టయిన చంద్రబాబు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆరోగ్య కారణాల ద్వారా ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కంటి చికిత్స నిమిత్తం అతనికి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను పూర్తి చేసిన ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నిన్న తీర్పు వెలువరించిన ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా గతంలో ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనేందుకు విధించిన ఆంక్షలను సడలించింది.

హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైకోర్టు తన పరిధికి మించి వ్యవహరించిందని, ట్రయల్ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు బెయిల్ ఎలా ఇస్తారని ఏపీ ప్రభుత్వం ప్రశ్నించనుంది. విచారణ కీలక దశలో ఉన్న సమయంలో హైకోర్టు జోక్యం సరికాదని, ట్రయల్ కోర్టు విచారణను హైకోర్టు ఎలా నిర్ధారిస్తుంది అంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తోంది. బెయిల్ మంజూరు చేసే సమయంలో కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడం ద్వారా కింది కోర్టు అధికారాల్లో హైకోర్టు జోక్యం చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. హైకోర్టు తీరు అసాధారణంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది.

Also Read: WhatsApp Update : వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై మెసేజ్‌ స్క్రీన్‌పైనే స్టేటస్‌ అప్‌డేట్స్‌.. అదెలా అంటే?