AP Govt: ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో నిలిపివేసిన బేబీ కిట్ పథకాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. నవజాత శిశువుల ఆరోగ్యం కోసం 11 వస్తువులతో కూడిన బేబీ కిట్‌ను గతంలో టీడీపీ ప్రభుత్వం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఈ పథకాన్ని నిలిపివేయగా.. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్దరించింది.
CBI Court : ఓబుళాపురం మైనింగ్ కేసు.. గాలి జనార్దన్‌రెడ్డికి ఏడేళ్లు జైలుశిక్ష
2014-2019 మధ్య కాలంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వం కొనసాగిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు అప్పట్లో నవజాత శిశువుల ఆరోగ్యం కోసం బేబీ కిట్లు అందజేయడం జరిగింది. శిశువులకు అవసరమైన 11 రకాల వస్తువులతో ఈ బేబీ కిట్ అందించేవారు. అయితే, 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి ఆ బేబీ కిట్ పథకాన్ని నిలిపివేశారు. నవరత్నాల అమలుపై ఫోకస్ పెట్టారు. అయితే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బేబీ కిట్ పథకాన్ని పునరుద్దరించాలని నిర్ణయించింది. నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడటం, శిశు మరణాల రేటును తగ్గించడంతోపాటుగా ఆర్థికంగా ఇబ్బంది పడే కుటుంబాలకు శిశుసంరక్షణ సామాగ్రిని ఉచితంగా అందించడం ఈ పథకం ఉద్దేశం. అదేసమయంలో.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం కోసం ఈ బేబీ కిట్ పథకంను కూటమి ప్రభుత్వం మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది.
India-Pakistan Tension: భారత్- పాక్ మధ్య యుద్ధం జరిగితే భారీగా ప్రాణ నష్టం?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన తల్లులకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో బేబీ కిట్ ను ఉచితంగా అందజేస్తారు. ఈ బేబీ కిట్‌లో 11 రకాల వస్తువులు ఉంటాయి. దోమ తెర, దుప్పటి, స్లీపింగ్ బెట్, యాంటీసెప్టిక్ లోషన్ తోపాటుగా నాప్ కిన్, డైపర్లు, షాంపూ వంటి సామాగ్రి ఉంటాయి. గతంలో ఈ పథకాన్ని ఎన్టీఆర్ బేబీ కిట్ పేరుతో అమలు చేశారు. రూ.800 విలువైన వివిధ సామాగ్రి అందజేశారు. అయితే, ఈసారి అమలు చేసే బేబీ కిట్ పథకంలో ఇంకా ఏమైన వస్తువులను యాడ్ చేస్తారా.. గత టీడీపీ ప్రభుత్వం తరహాలోనే ఈ పథకాన్ని అమలు చేస్తారా అనేది చూడాల్సిందే.