Site icon HashtagU Telugu

Geethanjali: గీతాంజలి కుటుంబానికి సీఎం జగన్ 20 లక్షల పరిహారం, ఏ ఒక్కరినీ వదిలిపెట్టేదే లేదు

Geethanjali

Geethanjali

Geethanjali: గీతాంజలి మరణం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమెది ఆత్మహత్యా లేదా ప్రమాదం కారణంగా చనిపోయిందా అన్నది దర్యాప్తులో తేలనుంది. కాగా ఆమె మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా ఇద్దరు పిల్లల తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో గీతాంజలి కుటుంబానికి సీఎం జగన్ అండగా నిలిచారు.

Geethanjali

తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య ఘటనపట్ల ముఖ్యమంత్రి వైయస్.జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందన్నారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.ఆడపిల్లల గౌరవ ప్రతిష్ఠలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని సీఎం జగన్ హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల కారణంగా ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Geethanjali Kids

వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఆమెకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి ఓ వీడియోలో గొప్పగా చెప్పింది. ఇదే ఆమె పాలిట శాపంగా మారింది. గీతాంజలిది పేద కుటుంబం. గతంలో ఆమె కుటుంబం ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేది. జగన్ ప్రభుత్వం ఆమెకు ఇంటి పట్టా అందించింది. అమ్మఒడి వస్తుంది. ఆ డబ్బుని ఆమె పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. ఈ విషయాలను ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. దాంతో కొందరు దారుణంగా ట్రోల్స్ కు పాల్పడ్డారు. ముఖ్యంగా టీడీపీ సోషల్ మీడియా కారణంగానే ఈ దారుణం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్ ట్రోలర్స్ పై యాక్షన్ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆమె మృతికి కారణమైన ఎవ్వరినీ వదిలిపెట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Aadhaar: మరోసారి ఆధార్‌ అప్‌డేట్‌ గడువు పొడిగింపు