Site icon HashtagU Telugu

Nominated Posts: ఏపీలో 38 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన‌.. జ‌న‌సేన‌కు కేటాయించినవి ఇవే

Pawan Kalyan

Pawan Kalyan

Nominated Posts: ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ద‌శ‌ల వారిగా నామినేటెడ్ ప‌ద‌వుల‌ను కేటాయిస్తూ వ‌స్తోంది. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీల్లోని కీల‌క నేత‌ల‌కు నామినేటెడ్ ప‌ద‌వుల్లో అవ‌కాశం క‌ల్పిస్తుంది. తాజాగా.. 38 మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ల పేర్ల‌ను ప్ర‌భుత్వం శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. ఈ ప‌ద‌వుల్లో టీడీపీ 31, జ‌న‌సేన‌కు 6, బీజేపీ ఒక స్థానం ద‌క్కింది. అభ్య‌ర్థుల ఎంపిక‌లో ప్ర‌జాభిప్రాయానికి ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో మిగిలిన మార్కెట్ క‌మిటీల చైర్మ‌న్ల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా 47 మార్కెట్ క‌మిటీల‌కు చైర్మ‌న్ల‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వాటిల్లో 37 టీడీపీ, ఎనిమిది జ‌న‌సేన‌, రెండు బీజేపీకి ద‌క్కాయి.

Also Read: CM Chandrababu : ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కార్యాచరణ: సీఎం చంద్రబాబు

ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ల ప‌ద‌వుల్లో జ‌న‌సేన‌కు ఆరు స్థానాలు ద‌క్కాయి. వాటిలో భీముని అనంత‌ల‌క్ష్మి (పెడ‌న‌), గ‌రిక‌పాటి శివ‌శంక‌ర్ (గ‌న్న‌వ‌రం), జుట్టుగ నాగ‌రాజు (ఉండి), కొత్త‌ప‌ల్లి వెంక‌ట‌ల‌క్ష్మీ (కొత్త‌పేట నియోజ‌క‌వ‌ర్గం అల‌మూరు మార్కెట్‌), రామ‌స్వామి నాయుడు (బీమిలి నియోజ‌క‌వ‌ర్గం బీమునిప‌ట్నం మార్కెట్‌), పొగిరి క్రిష్ణ‌వేణి (రాజం మార్కెట్ క‌మిటీ), బీజేపీకి చెందిన రామిరెడ్డిప‌ల్లి నాగ‌రాజు (జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం య‌ర్ర‌గుంట్ల మార్కెట్ క‌మిటీ) అవ‌కాశం ద‌క్కింది. మిగిలిన 31 స్థానాల్లో టీడీపీ నేత‌ల‌కు కేటాయించారు. వీరిలో ఆరుగురు ఎస్సీ వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కు ప్రాధాన్య‌త‌నిచ్చారు.