ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు వేసింది. తాజాగా ‘ఏపీ స్పేస్ పాలసీ'(Space Policy)ని అధికారికంగా ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రాన్ని అంతరిక్ష పరిశోధన, ఉత్పత్తి మరియు టెక్నాలజీ అభివృద్ధిలో ముందంజలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో సరికొత్త ప్రణాళికను రూపొందించింది. వచ్చే పదేళ్లలో దాదాపు రూ. 25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Stock Market : TCS, Airtel షేర్ల పతనంతో ₹2 లక్షల కోట్లు ఆవిరి! ఏం జరిగింది?
ఈ పాలసీ ప్రధానంగా రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి, తిరుపతి జిల్లా రౌతు సురమాలలో ప్రత్యేక స్పేస్ సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాంతాలు భౌగోళికంగా అనుకూలంగా ఉండడమే కాకుండా, లాజిస్టిక్, కమ్యూనికేషన్ సౌకర్యాలు ఉన్నందున స్పేస్ పరిశ్రమలకు మద్దతుగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈ స్పేస్ సిటీల ద్వారా పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చడం, స్టార్టప్‌లు, పరిశోధనా కేంద్రాలు ఏర్పడేలా చేయడం లక్ష్యం.
ఈ స్పేస్ పాలసీ అమలుతో దాదాపు 35వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. టెక్నాలజీ రంగంలో ప్రవేశం కలిగిన యువతకు ఇది గొప్ప అవకాశంగా మారనుంది. అంతరిక్ష ఉపగ్రహాల తయారీ, డేటా అనలిసిస్, లాంచ్ సర్వీసుల వంటి విభాగాల్లో స్థానిక యువత శిక్షణ పొందే విధంగా ప్రత్యేక కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Shubhanshu Shukla : కాసేపట్లో భూమిపైకి శుభాంశు శుక్లా
ఈ విధంగా ఏపీ స్పేస్ పాలసీ ద్వారా రాష్ట్రం సాంకేతిక ప్రగతికి కొత్త దారులు తెరవనుంది. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి లక్ష్యాలతో రూపొందిన ఈ పాలసీ, రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలవనుంది.