ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరొక తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని తెలుగుదేశం – జనసేన – భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం చెత్త పన్నును (AP Govt Abolishes Garbage Tax) పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ నిర్ణయంతో నగరాలు, పట్టణాల్లో ఇప్పటివరకు అమలులో ఉన్న చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి లభించనుంది. గత ప్రభుత్వ హయాంలో విధించిన ఈ పన్నుతో ప్రజలు ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారని, అందుకే దీన్ని పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొంది.
Balakrishna : బాలయ్య అఖండ 2లో విలన్ రోల్ చేస్తున్న హీరో..? షూటింగ్ చేశాను అంటూ లీక్ చేసిన హీరో..
2024 డిసెంబర్ 31 నుండి చెత్త పన్ను రద్దు అమలులోకి వస్తుందని ఏపీ మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇకపై నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు చెత్త పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా చేస్తూ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పన్ను రద్దు నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు భారీగా లబ్ధిపొందనున్నాయి.
IPS Officers: ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ షాక్..
చెత్త పన్నును రద్దు చేసే బిల్లును గత ఏడాది నవంబర్ 21 న ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ బిల్లును ప్రవేశపెట్టి, నగరాల్లోని ప్రజల ఆర్థిక భారం తగ్గించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రజల అభ్యర్థనలకు అనుగుణంగా ఉందని, ఇది సామాన్యుల జీవితాల్లో కొంతైనా ఆర్థిక ఊరటనిచ్చే పరిణామమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.