AP Governor : హాస్పటల్ లో చేరిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

ఒక్కసారిగా కడుపులో నొప్పి రావడంతో ఆయనను వెంటనే తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి కి తరలించారు

  • Written By:
  • Publish Date - September 18, 2023 / 07:29 PM IST

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazeer) అస్వస్థతకు గురై హాస్పటల్ లో చేరారు. ఒక్కసారిగా కడుపులో నొప్పి (Abdominal Pain) రావడంతో ఆయనను వెంటనే తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి (Tadepalli Manipal Hospital)కి తరలించారు. దీంతో గవర్నర్‌కు అల్ట్రా సౌండ్ సిటీ స్కానింగ్, బ్లడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు డాక్టర్స్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఫై గురించి మరింత వివరాలు తెలియాల్సి ఉంది. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించిన ఆయన.. మంగళూరులో న్యాయవిద్య పూర్తి చేశాడు.

అబ్దుల్ న‌జీర్ 1983లో న్యాయ‌వాదిగా కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ మొద‌లుపెట్టి 2003లో కర్ణాటక హైకోర్టు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యాడు. ఆ తరువాత అతను హైకోర్టు న్యాయ‌మూర్తిగా కూడా బాధ్య‌త‌లు నిర్వహించి 2017లో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌దోన్న‌తి అందుకున్నాడు. జస్టిస్ నజీర్ త్రిపుల్ తలాక్ చెల్లదంటూ 2017లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో, నోట్ల రద్దు చట్టబద్ధమని ప్రకటించిన సుప్రీం ధర్మాసనంలో, 2019లో అయోధ్య రామమందిరంపై తీర్పు వెలువరించిన రాజ్యంగ ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నాడు. జస్టిస్ నజీర్ 2023 జ‌న‌వ‌రి 4న ప‌ద‌వీ విర‌మ‌ణ పొందాడు. 2023 ఫిబ్రవరి 12న బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో ఎస్. అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ 24వ గవర్నర్‌గా భారత రాష్ట్రపతి నియమించబడ్డాడు.

Read Also : CM Jagan : తిరుపతిలో శ్రీనివాససేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌