Social Media Ban ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 13ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. 90 రోజుల్లో విధివిధానాలను ఖరారు చేసి.. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 13 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. 90 రోజుల్లోనే విధివిధానాలను ఖరారు చేస్తామని.. దీన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపడతామని ప్రకటించారు. సోషల్ మీడియా వల్ల పిల్లలకు నష్టం జరగకూడదన్నది తమ ఆలోచనని.. 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసు ఉన్నవారు సోషల్ మీడియా వాడకంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు చంద్రబాబు.
