ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం (AP Govt) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేసింది. పాఠశాలల్లో రాజకీయ పార్టీల గుర్తులు, వస్తువుల ప్రదర్శనను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్యతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రాంగణాలను రాజకీయాలకు అతీతంగా, విద్యా వాతావరణానికి అనుకూలంగా మార్చే దిశగా ఈ నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం ఏమిటంటే.. పాఠశాల ఆవరణలోకి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు తప్ప ఏ ఇతర అనధికారిక వ్యక్తులను అనుమతించరాదు అని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, బయటి విద్యార్థులతో ఇతర వ్యక్తులు ఫోటోలు దిగడం కూడా నిషేధమని జీవోలో స్పష్టం చేసింది. విద్యార్థుల భద్రత, విద్యా వాతావరణం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ నిబంధనలు నిదర్శనమని చెప్పవచ్చు.
Odisha : మూత్రాన్ని వాటర్ అనుకోని తాగిన అధికారి..అసలు ఏంజరిగిందంటే !!
ఇదిలావుండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద విద్యార్థులకు రవాణా అలవెన్స్ (ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్) అందిస్తోంది. నెలకు రూ.600 చొప్పున, మొత్తం 10 నెలలకు గాను రూ.6 వేలను ప్రభుత్వం విద్యార్థులకు అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థులకు విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది.