Site icon HashtagU Telugu

AP Govt : పేదలకు ఇళ్ల స్థలాలపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

Minister Parthasarathi Abou

Minister Parthasarathi Abou

పేదలకు ఏపీ సర్కార్ (AP Govt) తీపి కబురు తెలిపింది. భూమి , ఇల్లు లేని పేదలకు పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున స్థలాన్ని కేటాయిస్తామని రాష్ట్ర మంత్రి పార్థసారథి ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన మార్గదర్శకాలను ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన ప్రకారం.. ఈ పథకానికి అర్హత సాధించాలంటే దరఖాస్తుదారుడు బీపీఎల్ (BPL) కుటుంబానికి చెందినవాడై ఉండాలి. అంతేకాకుండా గతంలో ఇల్లు లేదా స్థలం కోసం ఎలాంటి లోన్ తీసుకోకూడదని స్పష్టంగా పేర్కొన్నారు.

Saif Ali Khan : సైఫ్ అలీఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల

పథకానికి దరఖాస్తు చేసుకునే వారి వద్ద ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలని, ఇది గుర్తింపు మరియు భౌగోళిక సమాచారం కోసం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. అలాగే మెట్ట ప్రాంతాల్లో 5 ఎకరాలకు మించిన వ్యవసాయ భూమి లేకుండా ఉండాలి. మాగాణి ప్రాంతాల్లో ఇది 2.5 ఎకరాలకు మించకూడదని స్పష్టం చేశారు. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్రంలోని పేద కుటుంబాలకు గొప్ప సాయం జరుగుతుందని మంత్రి పార్థసారథి అన్నారు. పట్టణాలు, గ్రామాల్లో భూముల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ఈ పథకం అమలు కోసం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ప్రారంభమవుతుందని, అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని అధికారులు తెలిపారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో పేదలకు ఆర్థిక భద్రత కలిగేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.