Telangana Employees : ఏపి రాష్ట్ర విభజన జరిగి.. తెలంగాణ ఏర్పాటై జూన్ 2తో పదేళ్లు ముగిసింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా పలు రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. ఇటీవల ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు హైదరాబాద్ లో భేటీ అయి పరిష్కారం కాని విభజన సమస్యలపై చర్చించారు. ఈ క్రమంలో తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం (ఆగస్టు 13న) ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఏపీ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను కేటాయించారు. వారిని స్వరాష్ట్రానికి పంపాలని ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం రిక్వెస్ట్ పై సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ నుంచి రీలీవ్ అయ్యే ఉద్యోగులు తమ కేడర్ ర్యాంక్‌లోనే విధుల్లో చేరతారని ఉత్తర్వులలో పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, తెలంగాణ కు చెందిన ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల.. ఇందుకు చొరవచూపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఏపి ముఖ్యమం చంద్రబాబుకి తెలంగాణ ఉద్యోగుల సంఘము ధన్యవాదములు తెలియచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగుల ను కూడా రిలీఫ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయవలసినదిగా తెలంగాణ ప్రభత్వాన్ని తెలంగాణ ఉద్యోగుల సంఘం కోరుతున్నది. ఈ సందర్బంగా జోనల్ స్థాయి మల్టీజోనల్ స్థాయి మరియు జిల్లాస్థాయి లలో పనిచేస్తున్న ఉద్యోగులను వారి స్థానికత ప్రకారం మరియు కోరిక మేరకు వారి రాష్ట్రాలకు పంపించుటకై తగిన ఉత్తర్వులు ఇవ్వవలసిన దిగా తెలంగాణ ఉద్యోగుల సంఘము రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నది. ఈ మేరకు ఏ. పద్మాచారి, హోనారారి ఛైర్మన్, మఠం రవీంద్ర కుమార్ అధ్యక్షులు, సి. హెచ్ హరీష్ కుమార్ రెడ్డి, ప్రధానకార్యదర్శి, పవన్ కుమార్ గౌడ్ సలహాదారుడు, ఎన్. నర్సింగ్ రావు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు G. జాకబ్,పి. కృష్ణారావు ఉపాధ్యక్షులు , సురేందర్, కిషోర్ కుమార్, జి. మహేష్ కుమార్, బోరెదా ప్రవీణ్ కుమార్, పి. పరమేష్ ఇతర తెలంగాణ ఉద్యోగులు సంఘము బాద్యులు మరియు సభ్యులు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కొరారు.