AP Govt – 21 Castes :తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలో వెనుకబడిన తరగతుల(బీసీ) జాబితాలో 138 కులాలు ఉన్నాయి. వీటిలో 31 కులాలకు బీసీ రిజర్వేషన్లపై ఇప్పటిదాకా ప్రాంతీయ, భౌగోళిక పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులను ఎదుర్కొంటున్న 31 బీసీ కులాల్లో 10 తెలంగాణలో, 21 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఏపీలోని 21 బీసీ కులాల వారికి రిజర్వేషన్లపై పరిమితులు ఉన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు వినతులు వెళ్లాయి. వాటిని పరిశీలించిన వైఎస్ జగన్ సర్కారు.. 21 బీసీ కులాలు, వాటి ఉప కులాల రిజర్వేషన్లపై ఉన్న ప్రాంతీయ, భౌగోళిక పరిమితులను తొలగించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము ఉత్తర్వులు జారీ చేశారు.ఇకపై ఆ 21 కులాలకు రాష్ట్రమంతటా బీసీ రిజర్వేషన్ వర్తిస్తుంది. వారికి రాష్ట్రవ్యాప్తంగా బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. ఈమేరకు జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కల్లుగీత పనిపై ఆధారపడిన శెట్టి బలిజ కులానికి మాత్రం రాయలసీమ ప్రాంతంలో ఈ నిబంధన వర్తించదు.
We’re now on WhatsApp. Click to Join.
21 కులాలు ఇవే..
ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో బీసీ రిజర్వేషన్లపై భౌగోళిక పరిమితులు తొలగిపోయిన కులాలలో.. బీసీ – ఏ గ్రూప్‌లోని కురకుల, పొండర, సామాంతుల (సామంత, సౌంటియా), పాల ఏకరీ, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నయనివారు, పాలేగారు, తొలగరి, కవలి, ఆసాదుల, కెవుట (కెవుటో, కెవిటి) కులాలు ఉన్నాయి. బీసీ – బీ గ్రూపులోని అచ్చుకట్లవాండ్లు, గౌడ (ఈడిగ, గౌడ, గమల్లా), కలాలీ, గౌండ్ల, శెట్టి బలిజ (రాయలసీమ మినహా అంతంటా), కుంచిటి వక్కలింగ (వక్కలింగ, కుంచిటిగ), గుడ్ల (గుడ్లయ) కులాలు ఉన్నాయి. బీసీ – డీ గ్రూపులోని మున్నూరు కాపు, పోలినాటి వెలమ, సదర, అరవ, అయ్యరక, నగరాలు, ముదలర్, ముదిలియర్, బెరి వైశ్య (బెరి శెట్టి), అతిరాస, కుర్మి, కలింగ కోమటి(కలింగ వైశ్య) కులాలు(AP Govt – 21 Castes) ఉన్నాయి.