Site icon HashtagU Telugu

AP Employees : జీతాలిస్తే చాలు,ఇంకేమొద్దు! ఉద్యోగుల‌కు త‌త్త్వం బోధ‌ప‌డి.!

Jagan Effect

Employees

ఏపీ ఉద్యోగులు(AP Employees) గొంతెమ్మ కోర్కెలు ఆవిరైపోయాయి. ప్ర‌తినెలా జీతాలు(Salaries) ఇస్తే చాల‌ని ప్రాధేయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతానికి వాళ్ల‌కు త‌త్త్వం బోధ‌ప‌డింది. ఏపీ గ‌వ‌ర్న‌ర్ హరిచంద‌న్ ను క‌లిసిన త‌రువాత ఉద్యోగ సంఘ నాయ‌కులు మీడియా ముందుకొచ్చారు. `ఇంత‌కంటే పోయేదేముంది..` అనే ప‌రిస్థితికి ఉద్యోగులు వ‌చ్చార‌ని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ నెల నుంచి ఆందోళ‌న‌కు దిగుతున్నామ‌ని ప్ర‌క‌టించారు. గ‌త ఏడాది ఒక‌సారి ఛ‌లో విజ‌య‌వాడ‌ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేశారు. ఆనాటి నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. అదే స‌మ‌యంలో ఉద్యోగుల‌కు కూడా చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం వేసిన మంత్రివ‌ర్గ ఉప సంఘంలోని మంత్రులు చేసిన కామెంట్స్ ను త‌ల‌చుకుంటూ ఉద్యోగ సంఘాల నాయ‌కులు వాస్త‌వ జీవితంలోకి వ‌స్తున్నారు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి కౌంట్ డౌన్ (AP Employees)

ప్ర‌భుత్వాలు సీపీఎస్ ర‌ద్దు చేసి ఓపీఎస్ ప‌ద్ద‌తిని అమ‌లు చేస్తే ఆర్థికంగా ప‌త‌నం అవుతాయ‌ని ఆర్బీఐ హెచ్చ‌రించింది. ఆ విష‌యం తెలుసుకున్న ఏపీ ఉద్యోగులు(AP Employees) `ఉన్న‌దీ పాయే ఉంచుకున్న‌దీ పాయే..` అనే సామెత‌గా అన్ని ర‌కాలుగా న‌ష్ట‌పోతామ‌న్న భావ‌న‌కు వ‌చ్చారు. ప్ర‌భుత్వం చెబుతోన్న జీపీఎస్ ప‌ద్ధ‌తి మీద దృష్టి పెట్టార‌ని తెలుస్తోంది. అంతేకాదు, జీపీఎస్ మిన‌హా మ‌రో మార్గంలేద‌ని మంత్రుల ఉప సంఘం గ‌తంలోనే చెప్పింది. అయిన‌ప్ప‌టికీ స‌సేమిరా అంటూ ఉన్న ఉద్యోగులు ఇప్పుడు వాస్త‌వాల‌ను గ్ర‌హిస్తున్నారు. పీఆర్సీతో పాటు ప‌లు డిమాండ్ల‌ను మంత్రుల క‌మిటీ ఎదుట ఉద్యోగులు ఉంచారు. ప్ర‌తి నెలా జీతం(Salaries) ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో రాష్ట్రం ఉంద‌ని తెలిసి కూడా జీతాల‌ను పెంచాల‌ని వాళ్లు డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Ap Employees : ఏపీ ఉద్యోగుల నోటి దురుసు! కూలీలు అంటే అంత అలుసా.!

వాస్త‌వంగా గ‌త ఏడాది తొలి అంకంలో ఫిట్మెంట్ రూపంలో రూ. 11వేల కోట్ల రూపాయ‌ల భారాన్ని ప్ర‌జ‌ల‌పై మోపుతూ ఉద్యోగుల‌కు జీతాలు పెంచారు. దానికి సంతృప్తి చెంద‌కుండా వివిధ ర‌కాల కోర్కెల‌ను ఉంచారు. వాటిని అమ‌లు చేయాలంటే మ‌రోసారి ప్ర‌జ‌ల‌పై భారం వేయాలి. ప్ర‌స్తుతం రాష్ట్రం ఆర్థికంగా చితికి పోయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో జీతాల‌ను పెంచాల‌ని ఉద్యోగులు డిమాండ్ చేయ‌డాన్ని ప్ర‌జ‌లు కూడా అంగీక‌రించ‌డంలేదు. గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా, ప‌లు ర‌కాల బెనిఫిట్స్ ఉద్యోగులకు ఇచ్చారు. హైద‌రాబాద్, అమ‌రావ‌తి లో ఉండ‌డానికి ఇళ్లు, ఉచిత ప్ర‌యాణం, ఐదు రోజుల ప‌నిదినాలు, ఉచిత భోజ‌నం..ఇలా ప‌లు ర‌కాల బెనిఫిట్స్ ప్ర‌క‌టించారు. అంతేకాదు, మిగులు బ‌డ్జెట్ తో ఏర్ప‌డిన తెలంగాణ ఉద్యోగుల కంటే మిన్నంగా ఫిట్మెంట్ ను ఇస్తూ ప్ర‌జ‌ల‌పై మోయ‌లేని భారాన్ని మోపారు. అదే భారం మ‌రింత ఎక్కువ అయ్యేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో ఫిట్మెంట్ ఇచ్చారు.

పీఆర్సీ వేయాల‌ని ఉద్యోగులు ప‌ట్టు  

ఇప్పుడు మ‌ళ్లీ పీఆర్సీ వేయాల‌ని ఉద్యోగులు ప‌ట్టుబ‌డుతున్నారు. ప్ర‌తి 10 ఏళ్ల‌కు ఒక‌సారి పీఆర్సీ సిఫార‌స్సులు ఉండేలా కేంద్ర ప్ర‌భుత్వం క‌మిటీని ఏర్పాటు చేసింది. అదే త‌ర‌హాలో రాష్ట్రాలు కూడా అమ‌లు చేయాల‌ని సూచాయ‌గా చెప్పింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి పీఆర్సీ వేయాల‌ని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఫ‌లితంగా ప్ర‌జ‌ల‌పై మోయ‌లేని భారం ప‌డుతుంది. ఇప్ప‌టికే బ‌డ్జెట్ లో 70శాతానికి పైగా ఉద్యోగుల జీత‌, భ‌త్యాల‌కు (Salaries) వాటాగా వెళుతోంది. అభివృద్ధి అనేది రాష్ట్రాల్లో శూన్యంగా మారుతోంది. పైగా గ‌త రెండేళ్లుగా కోవిడ్ ప్ర‌భావం సామాన్యుల జీవితాల‌ను ఛిద్రం చేసింది. ఆ రెండేళ్లు ప‌నిలేకుండా ప్ర‌తి నెలా జీతం తీసుకున్న ఉద్యోగులు ప్ర‌జ‌ల‌పై భారం మోసి పీఆర్సీ వేయించుకోవాల‌ని చూస్తున్నారు. ఇలాంటి ప‌రిణామాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎలా అధిగ‌మిస్తుంది? అనేది ప్ర‌శ్న‌.

Also Read : AP Employees: ఏపీ ఉద్యోగుల భ‌ర‌తం ప‌ట్ట‌నున్న జ‌గ‌న్‌

కేంద్ర ప్ర‌భుత్వం వ‌ర్క్ ఫ‌ర్ పే ప‌ద్థతిని ప‌రిశీలిస్తోంది. ప‌నికి త‌గిన వేత‌నం ఇవ్వాల‌ని చూస్తోంది. ఉద్యోగుల జీతాల విష‌యంలో సంస్క‌ర‌ణ‌లు తీసుకురాలేక‌పోతే, భార‌తావ‌నికి మోయ‌లేని భారంగా ఉద్యోగులు ప‌రిణ‌మిస్తార‌ని గ్ర‌హించింది. ఆ దిశ‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం కూడా ఆలోచిస్తోంది. రాబోవు రోజుల్లో అవినీతి ర‌హిత పాల‌న దిశ‌గా. అడుగులు వేస్తూ ఉద్యోగుల భ‌ర‌తం ప‌ట్టేందుకు సిద్ధ‌మ‌యింది. ఇప్ప‌టికే ఫేస్ రిక‌గ్రైజేష‌న్ ప‌ద్ధ‌తిని పెట్టిన ఏపీ స‌ర్కార్ ఉద్యోగుల ఆగ్ర‌హానికి గుర‌వుతోంది. అందుకే, వివిధ డిమాండ్ల‌తో స‌ర్కార్ మీద పోరాడేందుకు ఏప్రిల్ మాసాన్ని ఉద్యోగులు ఎంచుకున్నారు. అప్పుడు పిల్ల‌ల‌కు ప‌రీక్ష‌ల స‌మ‌యం. అందుకే, ఏప్రిల్ ను డెడ్ లైన్ గా పెట్టారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ఏమి చేస్తుంది? అనేది చూడాలి.