Site icon HashtagU Telugu

Guinness World Record : గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం ఏపీ డ్వాక్రా మహిళలు యత్నం

Andhra Pradesh Dwcra Womens

Andhra Pradesh Dwcra Womens

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు. మార్చి 8 మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఒకేరోజు రూ. 1 కోటి విలువైన వస్తువులను ఆన్‌లైన్ ద్వారా విక్రయించి, ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ట్రై చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళల శక్తిని ప్రపంచానికి చాటే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డ్వాక్రా మహిళలు తయారుచేసే అనేక ఆకర్షణీయమైన వస్తువులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో విక్రయమవుతున్నాయి. బుట్టలు, బొమ్మలు, గాజులు, అలంకరణ సామాగ్రి, గృహోపకరణాలు వంటి అనేక ఉత్పత్తులు నాణ్యమైనవి కావడంతో పాటు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. దీంతో ఆన్‌లైన్‌లో వీటి ఆదరణ పెరిగింది. రాష్ట్రంలో ఉన్న లక్షలాది మహిళలు, బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీ రుణాలు తీసుకుని, వివిధ వస్తువుల తయారీ యూనిట్లు ఏర్పాటుచేసి, ఆన్‌లైన్ ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు.

TDP : రైతు కన్నీళ్లు తుడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే..అది టీడీపీనే : ఓ రైతు

ప్రస్తుతం స్వయం సహాయక బృందాల మహిళలు ఒకేరోజు రూ. 1 కోటి విలువైన వస్తువులను అమ్మకాలు చేయడానికి రికార్డు నమోదు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ మెప్మా (మానవ వనరుల అభివృద్ధి) ఆధ్వర్యంలో ఈ రికార్డు నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు మార్చి 8న ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో విచ్చేసి, ఈ రికార్డు సృష్టికై జరిపే లావాదేవీలను పరిశీలించేందుకు అంగీకరించారు. దీంతో డ్వాక్రా మహిళలు చేసిన సామాన్య ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో ఈ వస్తువుల విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వం.. ఈ కామర్స్ సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. డ్వాక్రా మహిళల నుంచి వస్తువులు కొనుగోలు చేయడమే కాక, ఇతర రాష్ట్రాల్లోనూ వీటి ఆదరణ పెరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుంది.