DSC Hall Tickets : 25 నుంచి డీఎస్సీ హాల్‌టికెట్లు.. ఎగ్జామ్ కొత్త షెడ్యూల్

DSC Hall Tickets : అభ్యర్థులు ప్రిపేరయ్యేందుకు వీలుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)కు, డీఎస్సీ-2024కు మధ్య 4 వారాల గడువు ఉండాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ షెడ్యూలును మార్చారు.

  • Written By:
  • Publish Date - March 10, 2024 / 11:50 AM IST

DSC Hall Tickets : అభ్యర్థులు ప్రిపేరయ్యేందుకు వీలుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)కు, డీఎస్సీ-2024కు మధ్య 4 వారాల గడువు ఉండాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ షెడ్యూలును మార్చారు. కొత్త షెడ్యూలు ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు విడతలుగా సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ)  పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ప్రిన్సిపల్ పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు ఉంటాయి. మార్చి 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఈనెల 25 నుంచి హాల్‌టికెట్ల (DSC Hall Tickets) డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమైతే మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో షెడ్యూలును పూర్తిగా మార్చేశారు.

We’re now on WhatsApp. Click to Join

హైకోర్టులో పిటిషన్ వేస్తే..

టెట్ పరీక్ష ఫలితాలు మార్చ్ 14న వస్తున్నాయని, మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్టులో పలువురు విద్యార్థులు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై జవ్వాజి శరత్ చంద్ర వాదనలు వినిపించారు. ఒక్క రోజు సమయంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని శరత్ చంద్ర ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎన్నడూ ఇలాంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఇవ్వలేదని వాదనలు వినిపించారు. ఈ వాదనలను హైకోర్ట్ పరిగణలోకి తీసుకుంది. డీఎస్సీ షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది. టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలకు మధ్య  కనీసం నాలుగు వారాల గ్యాప్ ఉండాలని ఆదేశాలిచ్చింది.

Also Read : 2024 Oscar Awards : ఆస్కార్ అవార్డుల రేసులో టాప్ 10 మూవీస్.. ఇవే

  • ఏపీ డీఎస్సీ 2024 ద్వారా మొత్తం 6100 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
  • మొత్తం ఖాళీల్లో  ఎస్టీజీ 2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 2299 పోస్టులు, టీజీటీ 1264 పోస్టులు, పీజీటీ 215 పోస్టులు, ప్రిన్సిపల్ 42 పోస్టులు ఉన్నాయి.
  • ఏప్రిల్‌ 31 వరకు రాబోయే ఖాళీలనూ పరిగణనలోకి తీసుకొని, ఈ పోస్టులను ప్రకటించారు.
  • డీఎస్సీలో ఎంపికైన వారికి జూన్‌ 8న పోస్టింగులు ఇవ్వనున్నారు.
  • జిల్లా పరిషత్/మండల పరిషత్ /మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో టీచర్ పోస్టులను భర్తీచేయనున్నారు.

Also Read :Rashmi Gautam : పుట్టెడు దుఃఖంలో యాంకర్ రష్మీ