New Districts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు , పేర్ల మార్పుల కోసం ప్రభుత్వం కీలక చర్యలను ప్రారంభించింది. పరిపాలన మరింత సౌలభ్యం కల్పించేందుకు అవసరమైన మార్పులను పరిశీలించడానికి మంత్రి వర్గ ఉప సంఘాన్ని (కేబినెట్ సబ్ కమిటీ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీకి మొత్తం ఏడుగురు మంత్రులను నియమించగా, కమిటీ కన్వీనర్‌గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరించనున్నారు. ఈ కమిటీ ప్రజల అవసరాలు, స్థానిక సమస్యలు, అభివృద్ధి దిశలో అవసరమైన సవరణలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది.
జిల్లా, మండల సరిహద్దులు లేదా పేర్లలో మార్పులపై స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఇచ్చే సూచనలు, అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాంతాలను పునర్విభజించాలని ప్రభుత్వం ఆదేశించింది.
HHVM : సంధ్య థియేటర్ లో వీరమల్లు మార్నింగ్ షోలు క్యాన్సిల్..? అసలు నిజం ఏంటి..?
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో జిల్లా రెవెన్యూ డివిజన్ , మండల సరిహద్దుల మధ్య దూరం, జనాభా సాంద్రత, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక, సామాజిక అభివృద్ధి అంశాలు ప్రాధాన్యతగా పరిగణించాల్సిందిగా సూచించారు.
రాష్ట్రంలో సరిహద్దుల పునర్వ్యవస్థీకరణకు ముందు సమగ్ర అధ్యయనం అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పరిపాలనా సామర్థ్యం పెంపు, అభివృద్ధి ప్రాజెక్టుల సులభతరం కోసం ఈ మార్పులు అవసరమని అధికారులు భావిస్తున్నారు.
ప్రాంతాల సరిహద్దులు లేదా పేర్లు మార్చే ముందు, స్థానిక ప్రజల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రజల నుంచి సూచనలు తీసుకోవడం ద్వారా ఈ మార్పులు సామాజికంగా అంగీకారం పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
Krithi Shetty: కృతి శెట్టి మైండ్ బ్లోయింగ్ లుక్స్.. ఫస్ట్ టైం ముద్దుగుమ్మని ఇలా చూడటం