TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో చెన్నై పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, […]

Published By: HashtagU Telugu Desk
cm vijay with trisha

cm vijay with trisha

నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో చెన్నై పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, వేదిక వద్ద కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖుల కోసం ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ముందు వరుసలో విజయ్ తల్లిదండ్రులు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్, శోభ చంద్రశేఖర్‌కు సీట్లు కేటాయించారు. అదే వరుసలో నటి త్రిష కృష్ణన్, ఆమె తల్లికి సీట్లు కేటాయించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

వేడుక ప్రారంభానికి ముందు త్రిష, విజయ్ తల్లి శోభతో ఆప్యాయంగా మాట్లాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి సంభాషణపై మీడియా, అభిమానుల దృష్టి పడింది.  ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 118 కాగా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీల మద్దతుతో విజయ్ కూటమి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

  Last Updated: 10 May 2026, 11:01 AM IST