Andhra Pradesh: ఏపీలో అదృశ్యమైన మహిళలపై స్పందించిన డీజీపీ

ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్ల వ్యవస్థ ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్టు జనసేన ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తి నెలకొన్నది

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్ల వ్యవస్థ ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్టు జనసేన ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తి నెలకొన్నది. పవన్ కళ్యాణ్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నట్టు అధికార పార్టీ చెప్తుంది. నాకు ఢిల్లీ ఇంటిలిజెన్స్ తెలిపింది అంటూ పవన్ చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.అయితే ఈ ఇష్యూ ప్రస్తుతం పార్లమెంట్ వరకు వెళ్ళింది. ఏపీలో 26 వేల మంది మహిళలు అదృశ్యమైనట్టు పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదికలో 26 వేల మంది మహిళలు అదృశ్యమయినట్టు వెల్లడించింది. అయితే అదృశ్యమయిన వారిలో ఇప్పటికే 23 వేల మహిళలని గుర్తించామని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇందులో రకరకాల కారణాలతో కనిపించడం లేదని, అయితే మిగతా వారిని గుర్తించే పనిలో పోలీస్ వ్యవస్థ పని చేస్తున్నాడని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది అవగాహన లేకుండా 30 వేల మంది మహిళలు అదృశ్యమయినట్టు తప్పుడు సమాచారం ఇస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎలాంటి ఘటన జరిగినా దాన్ని గంజాయితో ముడిపెడుతున్నారని, ఇది సరైనదని కాదని డిజిపి సూచించారు. ఏపీలో క్రైమ్ రేట్ ను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలను చేపట్టామని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

Also Read: Warangal: వర్షాల కారణంగా కాజీపేట రైల్వే స్టేషన్ లోకి భారీగా వరద నీరు?