Site icon HashtagU Telugu

AP : ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

Ap Congress To Receive Appl

Ap Congress To Receive Appl

తెలంగాణ (Telangana) లో ఎలాగైతే ఎన్నికల వ్యూహాన్ని రచించారో..ఏపీలో కూడా అదే విధంగా ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేస్తుంది కాంగ్రెస్ అధిష్టానం (Congress). ఎన్నికలకు మూడు నెలల ముందు నుండే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించి..వారిలో ఎవరైతే కరెక్ట్…ప్రజల్లో ఎవరిపై నమ్మకం ఉంది..ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో అవన్నీ చూసి..పలు సర్వేలు చేసి టికెట్స్ కేటాయించడం జరిగింది. ఈ ప్లాన్ చక్కగా వర్క్ అవుట్ అయ్యింది. వారు ఎవరైతే విజయం సాధిస్తారో..వారు ఖచ్చితంగా విజయం సాధించారు.

ఇప్పుడు ఏపీ (AP)లో కూడా అదే మొదలుపెట్టింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అభ్యర్ధులకు ( Assembly and Parliament Elections Candidates) అప్లికేషన్లను మాణిక్కం ఠాకూర్ (Manickam Tagore) ప్రారంభించారు. మొదటి అప్లికేషన్ మడకశిర నుంచి సుధాకర్.. రెండవ అప్లికేషన్ గుంటూరు తూర్పు నుంచీ మస్తాన్ వలీ.. మూడవ అప్లికేషన్ బద్వేల్ నుంచీ కమలమ్మ నుంచి స్వీకరించారు.

ఈ సందర్భంగా మాణిక్కం ఠాకూర్‌ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాలకు అభ్యర్థులను నిర్ణయిస్తుంది. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్లు మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తారు. నిజమైన కాంగ్రెస్‌లోకి మాజీలు రావాలని పిలుస్తున్నాం. ఆర్కే పోటీ చేసే స్ధానం త్వరలో తెలుస్తుంది. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. క్యాష్ బేస్డ్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ త్వరలో ఏపీలో పర్యటన చేస్తుంది. పార్టీ లీడర్స్ ఎవరైనా ఎన్నికలో పోటీ చేసే ఆసక్తి ఉంటే చెయ్యొచ్చు , స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేసే నేతలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు” అని మాణిక్కం ఠాకూర్ చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు.. APCC అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వైఎస్ షర్మిల దూకుడు కనపరుస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే ఆమె ఈ నెల 23 నుంచి 9 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఈ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఆమె జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు రెండు జిల్లాల్లో కోఆర్డినేషన్ సమావేశాలు నిర్వహించాలని తలపెట్టారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు, ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ, జిల్లాలలో పార్టీ పరిస్థితితో పాటు నూతన చేరికలు వంటి అంశాలపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. అదే విధంగా అధికార పార్టీ వైసీపీ ఫై విమర్శలు కురిపిస్తూ జనాలు మాట్లాడుకునేలా చేస్తుంది. ఓవరాల్ గా తెలంగాణ లో ఎలాగైతే విజయం సాధించామో..ఏపీలో అదే విధంగా విజయం సాధించాలని కాంగ్రెస్ పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తుంది.

Read Also : YS Sharmila : వైసీపీ కంటికి కనిపించని పొత్తు బీజేపీతో పెట్టుకుంది – షర్మిల