AP CM : గ్రాఫ్ డౌన్ తెచ్చిన తంటా! గ‌వ‌ర్న‌ర్ మార్పుతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కౌంట్ డౌన్!!

ఏపీ సీఎం(AP CM) గ్రాఫ్ ని తెలుసుకున్న ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు

  • Written By:
  • Publish Date - February 13, 2023 / 12:27 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (AP CM) గ్రాఫ్ ప‌డిపోయింద‌ని తెలుసుకున్న ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు వ్యూహాన్ని మార్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న ప్ర‌భుత్వానికి స్పీడ్ బ్రేక‌ర్లు వేసేలా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే, ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్(Governor) హ‌రిచంద‌న్ ను మార్చేశార‌ని ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు వినిపిస్తోంది. రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు చాలా కాలం పాటు న‌ర‌సింహ‌న్ గ‌వ‌ర్న‌ర్ గా ఉన్నారు. ఆ త‌రువాత త‌మిళ సై తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ గా, ఏపీకి హ‌రిచంద‌న్ ను నియ‌మించారు. తొలి నుంచి తెలంగాణ ప్ర‌భుత్వానికి, త‌మిళ సైకి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంది. అదే, ఏపీ గ‌వ‌ర్న‌ర్ హ‌రిచంద‌న్ మాత్రం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అడుగుల‌కు మ‌డుగులొత్తారు. అందుకే, ఆయ‌న్ను బ‌దిలీ చేస్తూ చ‌త్తీస్ గ‌ఢ్ కు పంపార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్రాఫ్ ప‌డిపోయింద‌ని..(AP CM)

ఫ‌క్తు రాజ‌కీయాల‌ను న‌రేంద్ర మోడీ, అమిత్ షా ద్వ‌యం దేశ వ్యాప్తంగా న‌డుపుతోంది. ఏ మాత్రం బలంలేని చోట కూడా ప్ర‌భుత్వాల‌ను కూల్చేసి బీజేపీ అధికారంలోకి వస్తోంది. ద‌క్షిణ భార‌త దేశంలో ప‌ట్టును సాధించడానికి మాత్రం ఆ పార్టీకి అవ‌కాశం దొర‌క‌డంలేదు. అలాగ‌ని, ఆశ మాత్రం బీజేపీ వ‌దులుకోవ‌డంలేదు. స్వ‌ర్గీయ జ‌య‌ల‌లిత త‌ద‌నంత‌రం త‌మిళ‌నాడులో పాగావేయాల‌ని భావించింది. కానీ, ఉత్త‌ర భార‌త పార్టీలంట‌నే ఏహ్య‌భావ‌మున్న త‌మిళ ఓట‌ర్లు బీజేపీని ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేదు. అంతేకాదు హిందీ భాష అంటేనే అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ద్వేషం. ఇలాంటి పరిస్థితుల్లో గుంట‌కాడ‌న‌క్క‌లా త‌మిళ‌నాడులో బీజేపీ కాచుకుని ఉంది. అలాగే, ఏపీలోనూ అవ‌కాశం చూసుకుని బ‌ల‌ప‌డాల‌ని భావిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ విస్త‌రించ‌డానికి ప‌లు ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కొంత మేర‌కు విజ‌యం సాధించింది. అయితే, ఏపీలో ఎప్పుడు? ఎలా ఎంట్రీ ఇవ్వాలి? (AP CM)అనే దానిపై బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు క‌స‌ర‌త్తు చేస్తూనే ఉన్నారు.

Also Read : Jagan-KCR : తెలుగు రాజ‌కీయ సోద‌ర చ‌ద‌రంగం! పొంగులేటి,జ‌గ‌న్ భేటీ సీక్రెట్ ..!

ప్ర‌స్తుతం మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (AP CM) చుట్టూ తిరుగుతోంది. ఆయ‌న కుటుంబానికి చెందిన స‌భ్యుల ప్ర‌మేయం ఉంద‌ని సీబీఐ ప్రాథ‌మికంగా నిర్థారిస్తోంది. అంతేకాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ్ర‌ద‌ర్, ఎంపీ అవినాష్ రెడ్డిని, వైఎస్ భార‌తి వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు న‌వీన్ ను సీబీఐ ప్ర‌శ్నించింది. వాళ్ల తో పాటు ఎర్ర‌గంగిరెడ్డి ఇత‌ర నిందితుల‌ను తాజాగా విచారించిన సీబీఐ దూకుడు పెంచింది. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల ఆశీస్సుల కోసం ప్ర‌య‌త్నం చేశారు. ఇటీవ‌ల ఢిల్లీలో జ‌రిగిన పారిశ్రామిక‌వేత్త‌ల సద‌స్సుకు వెళ్లిన‌ప్పుడు అమిత్ షా, మోడీ అపాయిట్మెంట్ కోరారు. ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చిన‌ప్పుడు కూడా వాళ్ల‌ను క‌ల‌వ‌డానికి ప‌లు ప్ర‌యత్నాలు చేశారు. కానీ, ఢిల్లీ ముఖాముఖి అవ‌కాశం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సాధ్యంకాలేదు.

ఏపీ అడ్డగోలు వ్య‌వ‌హారాల‌కు చెక్ పెట్టేలా కొత్త గ‌వ‌ర్న‌ర్  

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌ధ్య ఎలాంటి పొర‌పొచ్చాలు లేక‌పోవ‌డంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Governor) అన్ని ర‌కాలు క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్లిద్ద‌రి మ‌ధ్యా రాజ‌కీయంగా గ్యాప్ వ‌చ్చింది. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ పావులు మీద బీజేపీ క‌న్నేసింది. ఇటీవ‌ల బీజేపీ ఢిల్లీ పెద్ద‌ల‌ను కాద‌ని, కేసీఆర్ కు రాజ‌కీయంగా ద‌గ్గ‌ర‌వుతున్నార‌ని ప‌సిగ‌ట్టింది. ఏపీలోకి బీఆర్ఎస్ ఎంట్రీ కూడా కేసీఆర్, జ‌గ‌న్ వ్యూహంలో భాగంగా గుర్తించింద‌ట‌. ఈ ప‌రిణామాలు భ‌విష్య‌త్ లోనూ బీజేపీకి ఏపీలో ప్ర‌వేశం లేకుండా చేస్తుంద‌ని ఢిల్లీ పెద్ద‌లు అంచ‌నా వేస్తున్నారట‌.

Also Read : Jagan-KCR : తెలుగు రాజ‌కీయ సోద‌ర చ‌ద‌రంగం! పొంగులేటి,జ‌గ‌న్ భేటీ సీక్రెట్ ..

ప్రాంతీయ పార్టీలంటే గిట్ట‌ని ఢిల్లీ పెద్ద‌లు అటు కేసీఆర్ ఇటు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(AP CM) గ్రాఫ్ ప‌డిపోయింద‌ని వివిధ స‌ర్వేల ద్వారా తెలుసుకున్నారు. దీంతో వాళ్లిద్ద‌ర్నీ ఒకేసారి టార్గెట్ చేయ‌డంపై క‌న్నేసింది. ఆ క్ర‌మంలో ఏపీ కొత్త గ‌వ‌ర్న‌ర్ గా(Governor) అత్యంత పెద్ద ప్రొఫైల్ ఉన్న అబ్దుల్ న‌జీర్ ను నియ‌మించింది. పైగా ఆయ‌న సుప్రీం కోర్టు జ‌డ్జిగా కీల‌క‌మైన అయోధ్య‌, 370 ర‌ద్దు వంటి అంశాల్లో తీర్పు ఇచ్చిన న్యాయ‌మూర్తి. ఏపీ అడ్డగోలు వ్య‌వ‌హారాల‌కు చెక్ పెట్టేలా ఈ నియామ‌కం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఇదంతా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్రాఫ్ ప‌డిపోయిన త‌రువాత బీజేపీ గేమ్ ప్లాన్ మార్పులో భాగంగా చోటుచేసుకున్న ప‌రిణామంగా రాజ‌కీయాల‌ను నిశితంగా ప‌రిశీలించే వాళ్ల భావ‌న‌.

Also Read : CM Jagan: మూడున్నరేళ్లలో జగన్ కట్టిన ఇళ్లు 5 మాత్రమే!