Site icon HashtagU Telugu

AP CM : జ‌గ‌న్‌ బ‌డాయి !28కి.మీ జ‌ర్నీకి హెలికాప్ట‌ర్‌,తాడేప‌ల్లి-తెనాలి చోద్యం!

AP CM

Jagan Heli

`తిన‌డానికి తిండిలేక‌పోయినా, మీసాల‌కు సంపెగ నూనె కావాల‌న్న‌ట్టు..` ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(AP CM) వాల‌కం ఉంది. తాడేప‌ల్లి నుంచి తెనాలికి హెలికాప్ట‌ర్ లో(Helicopter) ఆయ‌న వెళ్ల‌డం విడ్డూరం. కేవ‌లం 28 కిలోమీట‌ర్ల దూరానికి హెలికాప్ట‌ర్ ను వాడిన దేశంలోనే నెంబ‌ర్ 1 సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిలిచిపోతారు. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన సంద‌ర్భంలో ఆయ‌న బ‌డాయికిపోవ‌డం విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోంటోంది. ప్ర‌జాధ‌నం దుబారా ఎలా చేస్తున్నారో..ఇదో ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది.

తాడేప‌ల్లి నుంచి తెనాలికి హెలికాప్ట‌ర్ లో ..(AP CM)

రైతు భ‌రోసా నిధుల‌ను విడుద‌ల చేయ‌డానికి తెనాలికి (AP CM) జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెళ్లారు. అక్క‌డ ఏర్పాటు చేసిన వేదికపై భ‌రోసా బ‌ట‌న్ నొక్కారు. వాస్త‌వంగా న‌రేంద్ర మోడీ పీఎం కిసాన్ కింద ప్ర‌తి రైతు ఖాతాలో సోమ‌వారం రూ. 2వేలు జ‌మ చేశారు. ఆ మొత్తాన్ని చూపుతూ ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్మోహన్ రెడ్డి రైతుల‌ను బురిడీ కొట్టిస్తున్నారు. రాష్ట్ర వాటా కింద జ‌మ కావాల్సిన నిధులు చాలా వ‌ర‌కు కావ‌డంలేదు. వేలాది మంది రైతుల‌ను అన‌ర్హులుగా గుర్తిస్తూ రైతు భ‌రోసాకు దూరంగా చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం ఏడాదికి రూ. 6వేలు మూడు విడ‌త‌లుగా ఇస్తోంది. ఆ డ‌బ్బు జ‌మ అయిన‌ప్పుడ‌ల్లా రైతు భ‌రోసా అంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఊద‌ర‌కొడుతున్నారు. ఏడాదికి రూ. 13వేల 500 రైతు భ‌రోసా కింద స‌హాయం కింద రైతుల‌కు ఇస్తామ‌ని ఎన్నిక‌ల సంద‌ర్బంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన హామీ. ఆ మొత్తంలో కేంద్రం ఇస్తోన్న రూ. 6వేల‌ను మిన‌హాయించి కేవ‌లం రూ. 8వేల 500ల‌ను మాత్ర‌మే రాష్ట్ర ప్ర‌భుత్వం జ‌మ చేస్తోంది. ఇటీవ‌ల ఆ మొత్తం ఇవ్వ‌డానికి కూడా భారీగా కోత‌లు వేసింది. కేంద్ర ఇస్తోన్న అర్హులైన రైతుల జాబితా నుంచి వేలాది మందిని తొలిగించింది.

Also Read : Jagan Politics: ఎన్నికల పావు ఉత్తరాంధ్ర, జగన్ గ్రాఫ్ అక్కడే డల్

ఇలాంటి ఉత్తుత్తి ప్రోగ్రామ్ కు తాడేప‌ల్లి నుంచి హెలికాప్ట‌ర్లో (Helicopter)జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెళ్లారు. సుమారు రూ. 1090 కోట్లు విడుద‌ల చేస్తూ బ‌ట‌న్ నొక్కాన‌ని చెప్పారు. ఆ సంద‌ర్భంగా రాజ‌కీయ ప్ర‌సంగం చేస్తూ చంద్ర‌బాబు, ప‌వ‌న్ కు ఛాలెంజ్ విసిరారు. వేర్వేరుగా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము ఉందా? అంటూ స‌వాల్ చేశారు. మ‌రో ఛాన్స్ ఇవ్వండంటూ ఇటీవ‌ల కోరిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆ త‌రువాత దేవుడి ద‌య‌, ప్ర‌జ‌ల ఆశీస్సులు అంటూ స్వ‌రం మార్చారు. ఆ త‌రువాత ధ‌ర్మానికి, దుష్ట‌చ‌తుష్ట‌యానికి మ‌ధ్య జ‌రుగుతోన్న యుద్ధ‌మంటూ రాబోవు ఎన్నిక‌ల‌ను వ‌ర్ణించారు. పేద‌ల‌కు, ధ‌న‌వంతుల‌కు మ‌ధ్య జ‌రుగుతోన్న యుద్ధంగా ఇటీవ‌ల చెప్పారు. ఇప్పుడు చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయితే, వ‌ర్షాలు ప‌డ‌వ‌ని సెంటిమెంట్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వినిపించారు. ఇలా చెప్ప‌డానికి తాడేప‌ల్లి నుంచి తెనాలికి ఉన్న 28 కిలోమీట‌ర్ల ప్ర‌యాణానికి హెలికాప్ట‌ర్ ను వాడ‌డం శోచ‌నీయం.

కేవ‌లం 28 కిలోమీట‌ర్ల‌కు హెలికాప్ట‌ర్ వాడ‌డం.. 

ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (AP CM) బాధ్య‌తల స్వీక‌రించిన తొలి రోజుల్లో ప్ర‌జా ధ‌నం దుర్వినియోగంపై పెద్ద చ‌ర్చ జ‌రిగింది. సొంత మీడియాలోనూ పెద్ద ఎత్తున వార్త‌ల‌ను ప్ర‌చురించారు. ఆనాడు చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా, హైద‌రాబాద్ సెక్ర‌ట‌రియేట్ కు పెట్టిన రూ. 13కోట్ల ఖ‌ర్చుతో పాటు ఆయ‌న తాగిన మంచినీళ్ల బాటిల్ ఖ‌ర్చుల‌ను కూడా లెక్కించారు. అంతేకాదు, లోకేష్ అండ్ టీమ్ వాడిని తినుబండారాల ఖ‌ర్చును కూడా బ‌య‌ట‌కు తీసి సొంత మీడియా ద్వారా ప్ర‌జాధ‌నం దుర్వినియోగంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌లిగించారు. చంద్ర‌బాబునాయుడు ఎన్ని మంచినీళ్ల బాటిళ్లు తాగితే హెలికాప్ట‌ర్ ఖ‌ర్చుకు సరిపోతుంది? అనేది తాడేప‌ల్లి కోట‌రీ చెప్పాలి. నిధులు లేవ‌ని రోడ్ల‌ను వేయ‌కుండా వ‌దిలేశారు. గోతుల‌తో ఉన్న రోడ్ల మ‌ర‌మ్మ‌తుల కోసం విప‌క్షాలు చేసిన ఉద్య‌మాలు అనేకం. వాటిని బాగుచేయ‌డానికి డ‌బ్బులేదంటూ కేవ‌లం 28 కిలోమీట‌ర్ల‌కు హెలికాప్ట‌ర్ వాడ‌డం గ‌మ‌నార్హం. రోడ్లు స‌రిగాలేవ‌ని హెలికాప్ట‌ర్ ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాడారా? బ‌డాయికి చూపించాల‌ని ఆ ప‌నిచేశారా? అనే వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజాధనాన్ని హెలికాప్ట‌ర్ల‌కు,(Helicopter) ప్ర‌త్యేక విమానాల‌కు దుర్వినియోగం చేయ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాల‌ని కోరుకుందాం.

Also Read : AP CM : గ్రాఫ్ డౌన్ తెచ్చిన తంటా! గ‌వ‌ర్న‌ర్ మార్పుతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కౌంట్ డౌన్!!