CM Jagan Health: సీఎం జగన్ కు అస్వస్థత , అపాయింట్‌మెంట్లన్నీ రద్దు

CM Jagan Health: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. సీఎం వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎంఓ మధ్యాహ్నం అపాయింట్‌మెంట్లన్నీ రద్దు చేసింది.

రేపు ప్రారంభమయ్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులపాటు జరుగుతాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి జగన్ మంత్రులతో క్యాబినెట్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో రేపు అసెంబ్లీలో అనుసరించాల్సి వ్యూహంపై చర్చించారు. చంద్రబాబు అరెస్టు, స్కిల్ డెవలప్మెంట్ తదితర విషయాలు చర్చకు వచ్చే అవకాశముంది.

చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగే మొదటి సమావేశాలు కావడంతో విపక్షాలు పలు ప్రశ్నలు సంధించే అవకాశముంది. కేసు పూర్తి వివరాలను ప్రభుత్వం అసెంబీలో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రేపు వ్యవహరించాల్సి తీరుపై సీఎం క్యాబినేట్ భేటీలో పాల్గొన్నారు. కాగా ఈ సమావేశం అనంతరం ఆయన అస్వస్థకు గురయ్యారు. దీంతో అపాయింట్‌మెంట్లన్నింటినీ అధికారులు రద్దు చేశారు. సీఎంతో జరిగిన సమావేశంలో మంత్రులు బుగ్గన, బొత్స, పెద్దిరెడ్డితో పాటు ప్రభుత్వ విప్‌లు పాల్గొన్నారు.

Also Read: Drug Case: హీరో నవదీప్ కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు