Site icon HashtagU Telugu

Jagan: ఉత్తరాంధ్ర లో సొంత నేతలకే జగన్ షాక్ ఇవ్వబోతున్నారా..?

New Aarogyasri Card distribution in ap

telangana high court notice to cm jagan

ఏపీలో రాజకీయాలు (AP Politics) రోజు రోజుకు ఎంతగా కాకరేపుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత అంత మారిపోయింది. బాబు ను అరెస్ట్ చేసి..ఇక మనకు తిరుగులేదని జగన్ భావిస్తుంటే..పార్టీ నేతలు మాత్రం బాబును అరెస్ట్ చేసి జగన్ (AP CM Jagan) పెద్ద తప్పు చేసాడని మాట్లాడుకుంటున్నారు. బాబు అరెస్ట్ తర్వాత ప్రజల్లో విపరీతమైన సానుభూతి పెరిగిందని..ఇదే క్రమంలో జనసేన టీడీపీకి సపోర్ట్ ఇవ్వడం ప్రజల్లో మరింత ఆదరణ పెరిగేలా చేసిందని అంటున్నారు. టీడీపీ – జనసేన (TDP-Janasena) గాలి రోజు రోజుకు పెరుగుతుందని, ఎన్నికల సమయం నాటికీ మరింత పెరగడం ఖాయంగా భావిస్తున్నారు. ఈ గాలి కి ఫ్యాన్ రెక్కలు తెగిపోవడం ఖాయమని అంటున్నారు.

ఇదిలా ఉంటె ఈసారి ఉత్తరాంధ్ర ( Uttarandhra YCP Leaders ) లో సొంత పార్టీ నేతలకు జగన్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మొన్న జరిగిన గడప గడపకు సమీక్షలో కొంతమంది నేతలకు ఈసారి టికెట్ ఇవ్వడం లేదని..టికెట్ రాకపోయినప్పటికీ వారు బాధ పడకూడదని , పార్టీ కి సపోర్ట్ చేయాలనీ కోరారు. అయితే అది ఉత్తరాంధ్ర నేతల విషయంలోనే జగన్ అన్నట్లు అంత మాట్లాడుకుంటున్నారు. ఈసారి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్థానంలో కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలని జగన్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. పాతపట్నం నుంచి ఎమ్మెల్యే రెడ్డి శాంతికి మళ్ళీ సీటు ఇవ్వడం డౌటే అని, ఎచ్చెర్లలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ గ్రాఫ్‌ ఏమాత్రమూ బాగోలేదని సర్వేలో తేలినట్లు సమాచారం. ఇక రాజాంలో కంభాల జోగులుకు ఈసారి టికెట్ కష్టమే అంటున్నారు. బొబ్బిలిలో ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడిని మార్చాలని చూస్తున్నారట..

యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజుకు కష్టమే అని, శృంగవరపు కోట శాసనసభ్యుడు కడుబంది శ్రీనివాస్‌ని మార్చి కొత్తవారికి చాన్సు ఇవ్వాలని జగన్‌ యోచిస్తున్నట్లు తెలిసింది. పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్ రాజుకి యాంటీ ఉంది. నర్సీపట్నం, పాయకరావు, గాజువాక సీట్లలో కూడా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం మీద ఉత్తరాంధ్రలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి గడ్డుకాలమే అంటున్నారు. నిజంగా జగన్ వీరిందరికి టికెట్ ఇవ్వకపోతే..పార్టీ లో ఉంటారా..? లేక మరో పార్టీ లో జాయిన్ అవుతారా..? అనేది చూడాలి.

Read Also : Google Maps: ఇద్దరి వైద్యుల ప్రాణాలు తీసిన గూగుల్ మ్యాప్స్.. అసలేం జరిగిందంటే..?