Site icon HashtagU Telugu

CM Chandrababu : సీఎం చంద్రబాబు కొత్త సంప్రదాయం.. ఇక నుంచి ప్రతీ శనివారం..!

Cm Chandrababu With People

CM Chandrababu : ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ప్రతీ శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని కలిసేందుకు సమయం కేటాయిస్తానని గతంలో ఇచ్చిన మాటను ఆయన నిలుపుకున్నారు. తాజాగా శనివారం రోజు అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) వందలాది మంది ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.

We’re now on WhatsApp. Click to Join

తెలుగుదేశం అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచినందుకు  పలువురు వృద్ధులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దివ్యాంగులు కొంతమంది తమకు సాయం చేయాలని కోరగా చంద్రబాబు సాను కూలంగా స్పందించారు. టీడీపీ కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యల్ని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జై బాబు.. సీఎం బాబు నినాదాలతో టీడీపీ కార్యాలయం హోరెత్తింది.

Also Read :Siddharth Mallya : విజయ్‌మాల్యా ఎస్టేట్‌లో సిద్ధార్థ్‌ మాల్యా పెళ్లి.. క్రైస్తవ సంప్రదాయంలో వేడుక

రాష్ట్రంలో సంకీర్ణ సర్కారే ఉన్నప్పటికీ  టీడీపీ ముద్ర ప్రత్యేకంగా ప్రజలకు కనిపించేలా చేయాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు.  అధికారంలో ఉండే ఈ ఐదేళ్ల కాలంలో టీడీపీని మరింత బలోపేతం చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ప్రతి శనివారం రోజు ఆఫీసుకు వెళ్లి ప్రజల అర్జీలను స్వీకరించాలని చంద్రబాబు నిర్ణయించు కున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

Also Read :Elon Musk – 11 Children: 11వ బిడ్డకు తండ్రైన మస్క్‌.. మూడో భార్యకు సీక్రెట్‌గా మూడో బిడ్డ

అమరావతిపై కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆసక్తి

అమరావతే ఏపీ రాజధాని అని ఎన్నికలకు ముందు చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సీఎం అయ్యాక అమరావతే ఏపీ రాజధాని అని పునరుద్ఘాటించారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ఆయన అర్థం చెప్పారు. ఇప్పుడు అమరావతికి మరో గుడ్ న్యూస్ అందుతోంది. గతంలో అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాగ్ సహా 10 నుంచి 15 కేంద్ర సంస్థలు, జాతీయ బ్యాంకులకు చంద్రబాబు భూములు కేటాయించారు. అప్పట్లో తమకు కేటాయించిన స్థలాలను చూపించాలంటూ కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే ఏపీ సీఆర్‌డీఏ అధికారులను కోరినట్లు తెలుస్తోంది.

Also Read :Jamun Leaves: మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారా..? అయితే ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయట..!