Nara Lokesh Arrest : నారా లోకేష్ ను అరెస్ట్ చేయబోతున్నారా..?

  • Written By:
  • Publish Date - December 23, 2023 / 02:07 PM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ను సీఐడీ అరెస్ట్ (CID) చేయబోతుందా..? ప్రస్తుతం ఏపీలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. నారా లోకేశ్ అరెస్టుకు అనుమతివ్వండి అని ఏసీబీ (ACB Court) ప్రత్యేక కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సెక్షన్ 41ఏ నోటీసులోని షరతులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ఏసీబీ ప్రత్యేక కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది.

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ 14గా నారా లోకేష్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో నారా లోకేష్ యువగళం సభలో..పలు ఇంటర్వ్య ల్లో చేసిన వ్యాఖ్యల పైన సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఇదే కేసులో లోకేష్ రెండు సార్లు సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. లోకేష్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని..అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ కోర్టులో సీఐడీ పిటీషన్ దాఖలు చేసింది. యువగళం ముగింపు సందర్భంగా పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారని, చంద్రబాబు స్కిల్ స్కాం కేసుల దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారని, చంద్రబాబు పై తప్పుడు కేసులు బనాయించటంతో పాటుగా రిమాండ్ విధించటం తప్పని లోకేష్ అన్నారని, ఏసీబీ న్యాయమూర్తికి దురుద్దేశఆలను ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలున్నాయంటూ సీఐడీ తన మెమోలో పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.

రెడ్ బుక్ పేరుతో పోలీసులను, సాక్షులను బెదిరించారని…న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా పలు ఆరోపణలు చేశారని ఏసీబీ ప్రత్యేక కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది. నేరుగా అరెస్టు చేయవచ్చుగా అని సీఐడీని ప్రశ్నించింది కోర్టు. కోర్టు అనుమతి కోసం పిటిషన్ దాఖలు చేశామని సీఐడీ వెల్లడించింది. అయితే నారా లోకేశ్ ఇంటర్వ్యూలను చూసిన తర్వాత స్పందిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. మరి ఏసీబీ కోర్ట్ ఇంటర్వూస్ చూసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇదిలా ఉంటె నారా లోకేష్ ఫై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 175 స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అన్న దానిపై ఇంకా రెండు పార్టీల మధ్య చర్చలు నడుస్తున్నాయి. అలాగే సీఎం అభ్యర్థి ఫై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. మరో నెల రోజుల్లో పొత్తుల సంగతిని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి తేల్చేసే అవకాశాలున్నాయి. ఈ సమయంలో నారా లోకేష్ చేసిన ప్రకటనతో జనసేన లీడర్లు, కార్యకర్తల్లో మరింత అసహనం పెంచేసింది. సీఎం అభ్యర్థిగా ఎవరు ఉండాలనేది.. చంద్రబాబు, తాను మాట్లాడి డిసైడ్ చేస్తామని పవన్ కల్యాణ్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. కానీ అందుకు భిన్నంగా లోకేష్ మాత్రం.. సీఎం సీటు విషయంలో షేరింగ్ ఏదీ ఉండదు.. చంద్రబాబే తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఇంటర్వ్యూల్లో తేల్చిపారేశారు. ఇన్నాళ్ళు జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం అవుతాడని ఆ పార్టీ నేతలు బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు. కానీ లోకేష్ ఇలా ఏకపక్షంగా మాట్లాడటం ఏంటి.. పవన్ కూడా చంద్రబాబునే మళ్ళీ సీఎం చేయడానికి ఒప్పేసుకున్నాడా? లేక ఇప్పుడు చెబుతున్నట్టు తర్వాతే మాట్లాడుకుందాం అనుకున్నాడా? అన్న అనుమానాలు జనసైనికుల్లో మొదలయ్యాయి.

Read Also : TSRTC Sensational Announcement : మహిళలకు షాక్ ఇచ్చిన TSRTC