AP Caste Census: ఏపీలో కులగణన రిపోర్ట్.. అత్యధిక జనాభా ఉన్న కులాలివే!

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో 2024కు ముందు కులగణన చేసింది. అయితే ఆ వివరాలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా రెండేళ్ల క్రితం చేసిన కులగణనకు సంబంధించిన నివేదిక బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కూడా ముగింపు దశకు రాగా.. 2024 నాటి బీసీ జనాభా, ఇప్పుడు బీసీ జనాభా ఒకేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ జనాభా మొత్తం 5.31 కోట్ల మంది ఉన్నారు. అయితే పురుషుల కంటే […]

Published By: HashtagU Telugu Desk
AP Caste Census Report These Are the Castes with the Highest Population!

AP Caste Census Report These Are the Castes with the Highest Population!

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో 2024కు ముందు కులగణన చేసింది. అయితే ఆ వివరాలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా రెండేళ్ల క్రితం చేసిన కులగణనకు సంబంధించిన నివేదిక బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కూడా ముగింపు దశకు రాగా.. 2024 నాటి బీసీ జనాభా, ఇప్పుడు బీసీ జనాభా ఒకేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ జనాభా మొత్తం 5.31 కోట్ల మంది ఉన్నారు. అయితే పురుషుల కంటే మహిళలు 1.96 లక్షల మంది ఎక్కువ ఉన్నారు. మొత్తం జనాభా 5,31,39,056లో పురుషులు 2,63,60,353 మంది ఉంటే, మహిళలు 2,65,56,816 మంది ఉన్నారు. ఈ సర్వేలో సామాజిక వర్గాల జనాభాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ జనాభాలో బీసీలు ఏకంగా 50.59 శాతం (2.69 కోట్లు) మంది ఉన్నారు. రాష్ట్రంలో ఎస్సీ జనాభా 18.31% (ఎస్సీలు 97.32 లక్షల మంది) ఉన్నారు. ఓసీలు 23.53%, ఎస్టీలు 5.86%, ఏ కులమో చెప్పని వారు 8.75 లక్షల మంది ఉన్నారు. హిజ్రాలు 4,842 మంది, జెండర్‌ వెల్లడించని వారు 2.17 లక్షల మంది ఉన్నారు.

రాష్ట్రంలో బీసీలను 5 కేటగిరీలుగా విభజించగా, 138 కులాలు ఉన్నాయి. బీసీ-ఏ కింద 51, బీసీ-బీ కింద 27, బీసీ-సీ కింద ఒకటి, బీసీ-డీ కింద 45, బీసీ-ఇ కింద 14 కులాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో జనాభాలో అత్యధికంగా 80.83 శాతం (19.29 లక్షలు) బీసీలే ఉన్నారు. రెండో స్థానంలో విజయనగరం జిల్లా 76.55 శాతంతో (15.14 లక్షలు) ఉంది. మూడో స్థానంలో అనకాపల్లి జిల్లా 72.73 శాతంతో (12.74 లక్షలు) ఉంది. చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం 3.26 శాతం బీసీలు ఉన్నారు. బీసీల జనసంఖ్య పరంగా చూస్తే శ్రీకాకుళంలో అత్యధికంగా 19.29 లక్షల మంది ఉన్నారు. రెండో స్థానంలో కర్నూలు జిల్లా (18.85 లక్షలు), మూడో స్థానంలో విశాఖపట్నం జిల్లా (15.48 లక్షలు) ఉన్నాయి.

ఏపీలో ఎస్సీలు 18.31 శాతం (97.32 లక్షల మంది) ఉన్నారు. ఎస్టీలు 5.86 శాతం (31.16 లక్షలు) మంది ఉన్నారు. ఓసీలు 23.53 శాతం (1.25 కోట్లు) మంది ఉన్నారు. తమ కులం పేరు వెల్లడించని వారు 1.64% (8.75 లక్షల) మంది ఉన్నారు. ఎస్సీల్లో 59, ఎస్టీల్లో 34 ఉపకులాలు ఉన్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనాభాలో ఎస్సీల శాతం పరంగా 27.66% (4.28 లక్షలు)తో తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో ప్రకాశం 27.15% (4.94 లక్షలు), మూడో స్థానంలో ఏలూరు 24.71% (5.17 లక్షలు) మంది ఉన్నారు. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 0.54% మాత్రమే ఎస్సీ జనాభా ఉంది. ఎస్సీల జనసంఖ్య పరంగా తిరుపతి జిల్లాలో 5.61 లక్షలు, నెల్లూరు జిల్లాలో 5.47 లక్షలు, ఏలూరు జిల్లాలో 5.17 లక్షల మందితో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఏపీ జనాభాలో ఎస్టీల శాతం పరంగా మొదటి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా (94.40%) ఉంది. రెండో స్థానంలో పోలవరం జిల్లా 71.73 శాతం, మూడో స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా 30.53 శాతంతో ఉన్నాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి (0.94%) జిల్లాలో ఎస్టీ జనాభా ఒక్క శాతం కంటే తక్కువగా ఉంది. ఎస్టీల సంఖ్యాపరంగా అల్లూరి సీతారామరాజు జిల్లా (6.60 లక్షలు), పార్వతీపురం మన్యం జిల్లా (3.01 లక్షలు), పోలవరం జిల్లా (2.84 లక్షలు) వరుసగా ఒకటి, రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఏపీ జనాభాలో ఓసీల శాతం పరంగా కడప జిల్లా (7.80 లక్షలు) మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో తూర్పుగోదావరి జిల్లా (7.61 లక్షలు), మూడో స్థానంలో కాకినాడ జిల్లా (7.58 లక్షలు) ఉన్నాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో (5,743 మంది) ఓసీలు ఉన్నారు. 2024 కులగణనలో తమ కులాన్ని వెల్లడించని వారిలో విశాఖపట్నంలో (76,288 మంది) ఉన్నారు. రెండో స్థానంలో ఎన్టీఆర్‌ జిల్లా (57,466 మంది), మూడో స్థానంలో కర్నూలు జిల్లా (48,034 మంది) ఉన్నాయి.

 

  Last Updated: 19 May 2026, 03:10 PM IST