అమరావతిని ఏపీ రాజధానిగా (AP Capital) కేంద్రం మరోసారి గుర్తించింది. పార్లమెంట్ వేదికగా విడుదల చేసిన ఇంధన ధరల బులిటెన్ ను అమరావతి కేంద్రంగా చేసుకుని విడుదల చేసింది. దాని ప్రకారం ఇంధన ధరల్లో నెంబర్ 1 స్థానంలో ఏపీ ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యంత ఎక్కువ ధరకు పెట్రోలు విక్రయిస్తోన్న రాష్ట్రం ఏపీగా ఉంది. డీజిల్ ను అత్యధికంగా విక్రయిస్తోన్న రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఏపీ ఉండడం గమనార్హం.
అమరావతినే రాజధానిగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం(AP Capital)
ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.87 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.99.61గా ఉందని కేంద్రం తేల్చింది. పెట్రోల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా, డీజిల్ ధరల్లో లక్షద్వీప్ తొలి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ డీజిల్ ధరల్లో రెండో స్థానంలో ఉంది. ఆయా రాష్ట్రాల రాజధానుల్లోని ధరలను ప్రాతిపదికగా చేసుకుని ఈ బులిటెన్ ను గురువారం కేంద్రం విడుదల చేసింది. అమరావతినే రాజధానిగా (AP Capital) పరిగణించి కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను నిర్ణయించడం విశేషం. ఇక తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా, డీజిల్ రూ.97.82గా ఉంది.
రాజధాని అభివృద్ధి కోసం కేంద్రం నిధులను
తొలి నుంచి కేంద్రంగా అమరావతిని ఏపీ రాజధానిగా (AP Capital) చెబుతోంది. ఆ మేరకు గెజిట్ ను కూడా విడుదల చేసింది. సర్వే ఆఫ్ ఇండియా కూడా అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించింది. అంతేకాదు, విభజన చట్టం ప్రకారం రాజధాని అభివృద్ధి కోసం కేంద్రం నిధులను విడుదల చేసింది. భూగర్భ డ్రైనేజీలు, రోడ్లు ఇతరత్ర మౌలిక సదుపాయాల కోసం ప్రతి ఏడాది నిధులను విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు సుమారు 10వేల కోట్ల వరకు విడుదల చేసినట్టు కేంద్రం వద్ద లెక్కలు ఉన్నాయి. అమరావతిని రాజధానిగా చెబుతోన్న కేంద్రం మూడు రాజధానుల అంశాన్ని కూడా పరోక్షంగా సమర్థిస్తోంది.
రికార్ట్ ప్రకారం రాజధాని అమరావతిగా
రాజధాని నిర్ణయం విభజన చట్టంలో రాష్ట్రం పరిధిలో ఉందని చెబుతోంది. దాని ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా (AP Capital) గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా అందుకు అంగీకరించింది. ఏకగ్రీవంగా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ అప్పట్లో ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన వివరాలను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందచేసింది. ఆ మేరకు గెజిట్ ను కూడా విడుదల చేసింది. అటు రాప్ట్ర ఇటు కేంద్ర ప్రభుత్వాలు రాజధాని అమరావతిగా రికార్ట్ ప్రకారం చెబుతున్నాయి. కానీ, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు అంటూ ఊదగొడుతోంది.
Also Read : AP Capital : అమరావతిలో R-5! జై భీమ్, కొలకలపూడి పోరు!!
మరో రెండు నెలల్లో విశాఖ నుంచి పరిపాలన ఉంటుందని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. మరో వైపు సుప్రీం కోర్టులో డిసెంబర్లో రాజధాని మీద విచారణ జరగనుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆలోచనకు భిన్నంగా వాతావరణం కనిపిస్తోంది. అయితే, పాలన మాత్రం విశాఖ నుంచి సాగిస్తానంటూ చెబుతోన్న జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ తాజాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా అమరావతిని రాజధానిగా పరిగణిస్తూ అక్కడ ఉండే ఇంధన ధరలను ప్రాతిపదికగా తీసుకుని నివేదికను విడుదల చేయడం గమనార్హం.
Also Read : AP Capital : జగన్ కు మరోసారి `అమరావతి` షాక్, సుప్రీంలో భంగపాటు!