AP Capital : ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి, తేల్చేసిన కేంద్రం!

పార్ల‌మెంట్ వేదిక‌గా ప్ర‌తిసారీ ఏదో ఒక సంద‌ర్భంలో ప్ర‌త్యేక‌హోదా,పోల‌వ‌రం,అమ‌రావ‌తి

  • Written By:
  • Updated On - February 8, 2023 / 05:06 PM IST

పార్ల‌మెంట్ వేదిక‌గా ప్ర‌తిసారీ ఏదో ఒక సంద‌ర్భంలో ప్ర‌త్యేక‌హోదా, ఏపీ రాజ‌ధాని(Amaravathi) అంశం తెర‌మీద‌కు వ‌స్తోంది. గ‌తంలో తెలుగుదేశం పార్టీ స‌భ్యులు ప‌లుమార్లు పోల‌వ‌రం, అమ‌రావ‌తి, ప్ర‌త్యేక‌హోదా అంశాల‌ను ప్ర‌స్తావించారు. కానీ, ఈసారి వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి(Vijayasaireddy) రాజ్య‌స‌భ‌లో ప్ర‌త్యేక హోదా, ఏపీ రాజ‌ధాని అంశాన్ని ప్ర‌స్తావించ‌డం రాజ‌కీయ కోణాన్ని సంత‌రించుకుంది.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి (Amaravathi)

స‌మీప భ‌విత్తులోనే ఎన్నిక‌లు ఉంటాయ‌ని ఏపీ అంతటా వినిపిస్తోంది. ఆ క్ర‌మంలో అధికార‌, ప్ర‌తిప‌క్షాలు పోటీప‌డుతూ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళుతున్నాయి. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం అంటూ వైసీపీ ఓట‌ర్ల త‌లుపు త‌డుతోంది. ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి, ఇంటింటికి తెలుగుదేశం త‌దిత‌ర ప్రోగ్రామ్స్ తో టీడీపీ ప్ర‌చారం చేస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఉంటాయ‌ని కూడా చంద్ర‌బాబు అంచ‌నా వేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో పార్ల‌మెంట్ వేదిక‌గా బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహ‌రావు వ్యూహాత్మ‌కంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. ఆనాడు చంద్ర‌బాబు త‌యారు చేసిన బిల్లు ప్ర‌కారం రిజర్వేష‌న్లు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఉంద‌ని, కేంద్ర ప‌రిధిలో ఆ అంశం లేద‌ని ఎన్డీయే ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చింది.

Also Read : Capital AP : విశాఖ‌కు ఆర్బీఐ త‌ర‌లింపు? శ‌ర‌వేగంగా రాజ‌ధాని హంగులు!

తాజాగా ఏపీ రాజ‌ధాని అంశాన్ని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి(Vijayasaireddy) లేవ‌నెత్తారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి అంటూ ఎన్డీయే ప్ర‌భుత్వంలోని హోంశాక స‌హాయ‌మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇవ్వ‌డం మ‌రోసారి రాజ‌ధాని అంశం రాజ‌కీయ చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. ఆయ‌న ఇచ్చిన స‌మాధానం ప్ర‌కారం విభజన చట్టం ప్రకారం `ఏపీ రాజధానిగా అమరావతిని 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 ప్రకారం రాజధాని ఏర్పాటుకు కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ సూచనలు, సలహాలు, నివేదికల రూపంలో రాష్ట్ర స్వీక‌రించింది. దాన్నిఅధ్యయనం చేసి రాష్ట్ర రాజధానిగా అమరావతిని(Amaravathi) ఎంపిక చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం ఏపీసీఆర్డీయేను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది.` అంటూ వివ‌ర‌ణ ఇచ్చారు.

సుప్రీంకోర్టు పరిధిలో రాజధాని 

అంతేకాదు, ప్రస్తుత ఏపీ ప్రభుత్వం 2020లో సీఆర్డీయేను రద్దు చేసి, మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొస్తున్నట్టుగా కొత్త బిల్లును తీసుకొచ్చిందని నిత్యానంద్ రాయ్ రాత‌పూర్వ‌క ప్ర‌తిలో పొందుప‌రిచారు. ఆ తర్వాత ఆ బిల్లును వెనక్కి తీసుకుందని, సీఆర్డీయే చట్టానికి కొనసాగింపుగా మరొక బిల్లును తీసుకొచ్చిందని వివ‌రించారు. రాజధాని(Amaravathi) అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, రాజ‌ధానిపై ఇంతకు మించి మాట్లాడితే `సబ్ జ్యుడిస్` అవుతుందని తెలిపారు. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని రాత‌పూర్వ‌క వివ‌ర‌ణ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Vizag Capital : జగన్ విశాఖ కల, ఈ సారి బలమైన ముహూర్తం

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో విజ‌య‌సాయి రెడ్డి(Vijayasaireddy) గ‌ళం విప్పారు. ప్రత్యేక హోదా విష‌యంలో కాంగ్రెస్, బీజేపీ మోసం చేశాయని ఆక్రోశించారు. ప్రత్యేక హోదా అంశంలో ఆ రెండు పార్టీలు సంయుక్తంగా విఫల‌కావ‌డంతో 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశాయని వెల్లడించారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని బీజేపీ చెబుతోందని, కానీ హోదా కోసం తాము పోరాటం కొనసాగిస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంలో ఏ పార్టీలు వచ్చినా, ప్రభుత్వం అనేది ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుందని అన్నారు.

ఆర్టికల్ 154 ప్రకారం రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే..(Vijayasaireddy)

మూడు రాజధానుల అంశంపైనా సాయిరెడ్డి మాట్లాడారు. ఆర్టికల్ 154 ప్రకారం రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని అన్నారు. రాజధానిపై సంపూర్ణ అధికారం రాష్ట్రానిదేనని తెలిపారు. స‌రిగ్గా ఇక్క‌డే, రాబోవు ఎన్నిక‌ల అస్త్రాల‌ను పార్ల‌మెంట్ వేదిక‌గా వైసీపీ బ‌య‌ట‌కు తీస్తుంద‌ని స్ప‌ష్టం అవుతోంది. కాపు రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని రాష్ట్ర ప‌రిధిలోకి నెట్ట‌డం ద్వారా మ‌రోసారి చంద్ర‌బాబును ఇరుకున పెట్టేందుకు బీజేపీ, వైసీపీ మాస్ట‌ర్ స్కెచ్ వేశాయి. అలాగే, ప్ర‌త్యేక హోదా మీద పోరాటం చేస్తూనే ఉంటామ‌ని విజ‌యసాయిరెడ్డి(Vijayasaireddy) చెప్ప‌డం రాజ‌కీయంగా న‌ష్ట నివార‌ణ‌కు వైసీపీ దిగింద‌ని బోధ‌ప‌డుతోంది.

Also Read : 3 capitals: విశాఖ రాజ‌ధానికి జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్

ఏపీ రాజ‌ధాని(Amaravathi) విష‌యం అంశం సుప్రీం కోర్టులో ఉన్న‌ప్ప‌టికీ పార్ల‌మెంట్ వేదిక‌గా మూడు రాజ‌ధానుల అంశాన్ని వైసీపీ ఎంపీ విజ‌య‌సారెడ్డి ప్ర‌స్తావించారు. ఢిల్లీ వేదిక‌గా ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశాఖ రాజ‌ధాని అంటూ ప్ర‌క‌టించారు. కేంద్రం మాత్రం ఆచితూచి ఏపీ రాజ‌ధాని అమ‌రావతి అంటూ తెలుపుతూ గ‌త రెండేళ్లుగా జ‌రిగిన ప‌రిణామాల‌ను వివ‌రించింది. ఏపీ బీజేపీ మాత్రం అమ‌రావ‌తి ఏకైక రాజ‌ధాని అంటూ చెబుతోంది. రాజ‌ధాని అంశంలో కేంద్రాన్ని రాష్ట్ర సంప్ర‌దించ‌లేద‌ని చెబుతూ బీజేపీ గేమ్ మొద‌లు పెట్టింది. ఇక రాజ‌ధాని నిర్ణ‌యం అనేది రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉంటుంద‌ని ఆర్డిక‌ల్ 154 ను ఉటంకిస్తూ విజ‌య‌సాయిరెడ్డి స‌రికొత్త డ్రామాకు తెర‌లేపారు.