Site icon HashtagU Telugu

AP Cabinet : ప్రారంభమైన ఏపి కేబినెట్‌..పలు అంశాలపై చర్చ

Apcabinet

Apcabinet

AP Cabinet: ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu)అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ చర్చల్లో భాగంగా.. స్థానిక సంస్థలు, సహకారం సంఘాల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను రద్దు చేసే అవకాశముంది. దీనిపై భేటీలో చర్చిస్తున్నారు. మరోవైపు జగన్ హయాంలో ఎక్సైజ్‌ శాఖలో జరిగిన అవకతవకలు, మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గతంలో తీసుకొచ్చిన 217 జీవో రద్దుపై చర్చ కొనసాగుతోంది. ఇక మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్‌లో తీర్మానం చేసే అవకాశముంది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ర్యాటిఫికేషన్‌ సహా వాలంటీర్ల వ్యవస్థ, రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమాలపై వస్తున్న ఫిర్యాదులు చేపట్టాల్సిన చర్యలపైనా చర్చిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఆగస్టు నెల 15వ తేదీ నుంచి అన్నా క్యాంటిన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. వంద క్యాంటిన్లను ప్రారంభించాలన్న లక్ష్యంతో పెట్టుకున్నారు. పది రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దీనిపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశముంది. దీంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశముందని తెలిసింది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.

మరోవైపు కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు చీరాలకు వెళ్లాల్సి ఉండగా.. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఆ పర్యటనను సీఎం రద్దు చేసుకున్నారు. విజయవాడలో నిర్వహించే చేనేత దినోత్సవంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

Read Also: Andhra Pradesh: ఏపీ హోంమంత్రిని కలిసిన వైఎస్ సునీత