AP Cabinet meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటి జరుగనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఏపీ సర్కారు ఈ-కేబినెట్ భేటీని నిర్వహించనుంది.
We’re now on WhatsApp. Click to Join.
2014-19 మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఈ-కేబినెట్ నిర్వహించింది. తిరిగి మళ్లీ రేపటి నుంచి ఈ-కేబినెట్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. అజెండా మొదలుకుని కేబినెట్ నోట్స్ వరకు ఆన్ లైన్ ద్వారానే మంత్రులకు ప్రభుత్వం అందజేయనుంది. ఈ-కేబినెట్ నిర్వహణపై మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. ఈ-కేబినెట్ వల్ల ఉపయోగాలను జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ వివరించారు. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
కాగా, ఈ కేబినెట్ వల్ల ఉపయోగాలను తెలుపుతూ మంత్రుల కార్యదర్శులకు జీఏడీ అధికారులు తెలిపారు. పూర్తిగా పేపర్ లెస్ కేబినెట్ ను నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించి మంత్రులందరికీ ట్యాబ్‌లను పంపిణీ చేశారు. అయితే రేపటి సమావేశంలో ఏపీ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.