ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం (AP Cabinet) ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు (CHandrababu) అధ్యక్షతన ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రధానంగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా “తల్లికి వందనం” పథకం, “అన్నదాత సుఖీభవ” పథకాల అమలు విషయంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం గత సంవత్సరం నుండి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరపనుంది.
IPL 2025: ఈ IPL సీజన్లో వీళ్లే మొనగాళ్లు
తల్లికి వందనం పథకం కింద పాఠశాల విద్యార్థుల తల్లులకు వార్షికంగా రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు సమాచారం. ఈ పథకం జూన్ 12న ప్రారంభమవుతుందని, నిధుల కేటాయింపు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానాలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.20,000 ఆర్థిక సాయం అందించనున్నారు. ఇందులో భాగంగా రూ.6,000 పీఎం కిసాన్ ద్వారా, మిగిలిన రూ.14,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచే జమ కానున్నాయి. ఈ నిధులను మూడు విడతలుగా విడుదల చేయనున్నారు.
Beauty Tips: ముఖంపై ఉన్న మచ్చలు, డార్క్ స్పాట్స్ ఒక్కసారిగా మాయం కావాలంటే ఇలా చేయండి!
ఇతర ముఖ్య అంశాల్లో అమరావతి పునర్నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగావకాశాల కల్పన, రాష్ట్ర ఆర్థిక స్థితిపై సమీక్ష ప్రాధాన్యతగా నిలిచాయి. టాటా పవర్, జాన్ కాకిరెల్ వంటి సంస్థలతో పెట్టుబడుల ఒప్పందాలపై భూముల కేటాయింపు అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. పాత ప్రభుత్వం వదిలిన ఆర్థిక బాద్యతల నుంచి బయటపడేందుకు, సంక్షేమ, అభివృద్ధి మధ్య సమతుల్యత సాధించేందుకు కొత్త వ్యూహాలపై మంత్రివర్గం దృష్టి సారించింది. మొత్తంగా ఈ సమావేశం రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక స్థిరత్వాన్ని అందించే దిశగా కీలకంగా మారనుంది.