ఈ నెల 17న మరోసారి ఏపీ క్యాబినెట్ భేటీ (AP Cabinet Meeting) జరగనుంది. సీఎం (Chandrababu) అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు గురువారం జరిగిన క్యాబినెట్ భేటీలో కొన్ని అంశాలపై చర్చలు పూర్తిగా జరగలేదు. ఈరోజు జరిగిన సమావేశంలో 2,733 కోట్ల పనులకు ఆమోదం ఇచ్చారు. ముఖ్యంగా మున్సిపల్ చట్టసవరణ ఆర్డినెన్స్, భవన నిర్మాణాలు, లేఔట్ల అనుమతుల జారీ వంటి అంశాలు కేబినెట్ ఆమోదానికి వచ్చాయి.
Tomato Farmers : కష్టాల్లో టమాట రైతులు.. తీవ్ర నిర్ణయం
అలాగే కేబినెట్ భేటీలో మరో కీలక నిర్ణయంగా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీలో 19 కొత్త పోస్టుల ఏర్పాటు, తిరుపతిలో ఈఎస్‌ఐ ఆస్పత్రి 100 పడకలకు పెంపుదల వంటి పథకాలకు ఆమోదం లభించింది. ఇక గుంటూరు జిల్లాలో పత్తిపాడు మండలంలో కూడా 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదం ఇవ్వబడింది. ఈ నిర్ణయాలు రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణకు పెద్ద పునాది వేసేందుకు దోహదం చేయనున్నాయి.
వీటితో పాటు ఎస్‌ఐపీబీ ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు, అనకాపల్లి జిల్లాలో 106 ఎకరాల్లో పెట్టుబడులకు ఆమోదం లభించాయి. రాష్ట్రంలో 5 కొత్త సంస్థలు క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులకు హామీ ఇచ్చాయి. అలాగే 1,174 కోట్ల రూపాయల పెట్టుబడితో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సౌర మరియు పౌర విద్యుత్ రంగంలో కూడా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు, పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. టాటా సంస్థ 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఈ ప్లాంట్ ద్వారా రాష్ట్రానికి రూ.2 వేల కోట్ల పెట్టుబడులు, 1380 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు.