Site icon HashtagU Telugu

AP Budget: ఏపీ బ‌డ్జెట్ రూ. 2.94 ల‌క్ష‌ల కోట్లు.. కేటాయింపులు ఇలా!

AP Budget

AP Budget

AP Budget: ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ (AP Budget) ప్రవేశపెట్టారు. రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ రూపొందించినట్లు ఆయన చెప్పారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు కాగా.. మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు అని తెలిపారు. ద్రవ్యలోటు 68,743 కోట్లు అని తెలిపారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు.

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజలు పాతరేశారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి 93 శాతం మంది ప్రజలు మద్దతు పలికారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనుభవంతో సీఎం చంద్రబాబు ఏపీలో అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

Also Read: Gambhir Press Conference: రోహిత్‌- కోహ్లీ ఫామ్‌ల‌పై గంభీర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ఓపెనింగ్‌లో మార్పులు!

వార్షిక బడ్జెట్ స్వరూపం

ఏపీ బడ్జెట్‌లో శాఖల వారీగా కేటాయింపులు ఇలా

సంక్షేమానికి పెద్దపీట