AP Budget : న‌వ‌ర‌త్నాల క‌ళ‌, రూ. 2లక్ష‌లా 79వేల కోట్ల బ‌డ్జెట్‌

న‌వ‌ర‌త్నాల చుట్టూ 2023-24 అంచ‌నా బ‌డ్జెట్ (AP Budget) క‌నిపిస్తోంది.

  • Written By:
  • Updated On - March 16, 2023 / 12:06 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చిన న‌వ‌ర‌త్నాల చుట్టూ 2023-24 అంచ‌నా బ‌డ్జెట్ (AP Budget) క‌నిపిస్తోంది. సంక్షేమానికి (Welfare )పెద్ద పీట వేస్తూ అభివృద్ధి దిశ‌గా నిధుల కేటాయింపు దాదాపు శూన్యంగా చూపించారు. అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. రూ. 2,79,279 కోట్లతో బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది ఎన్నికల దిశ‌గా బ‌డ్జెట్ కేటాయింపులు క‌నిపిస్తున్నాయి. రెవెన్యూ లోటును రూ. 22,316 కోట్లుగా చూపుతూ అత్య‌ధికంగా పెన్ష‌న్ల‌కు ఎక్కువ కేటాయింపు చూపారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి, పోలవ‌రం త‌దిత‌రాల‌కు ఏ మాత్రం కేటాయింపులు క‌నిపించ‌కుండా రూపొందించిన బ‌డ్జెట్ లోని హైలెట్స్ ఇలా ఉన్నాయి.

బడ్జెట్ హైలైట్స్: (AP Budget)

రెవెన్యూ వ్యయం – రూ. 2,28,540 కోట్లు
రెవెన్యూ లోటు – రూ. 22,316 కోట్లు
మూలధన వ్యయం – రూ. 31,061 కోట్లు
ద్రవ్య లోటు – రూ. 54,587 కోట్లు
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.77 శాతం
జగనన్న విద్యా దీవెనకు – రూ. 2,841.64 కోట్లు
జగనన్న వసతి దీవెన – రూ. 2,200 కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా – రూ. 4,020 కోట్లు
వైఎస్సార్ పెన్షన్ కానుక – రూ. 21,434.72 కోట్లు (Welfare)
వైఎస్సార్ పీఎం బీమా యోజన – రూ. 1,600 కోట్లు
రైతులకు వడ్డీ లేని రుణాలు – రూ. 500 కోట్లు
డ్రాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు – రూ. 1,000 కోట్లు
వైఎస్సార్ వాహనమిత్ర – రూ. 275 కోట్లు
వైఎస్సార్ మత్స్యకార భరోసా – రూ. 125 కోట్లు
జగనన్న చేదోడు – రూ. 350 కోట్లు
మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ – రూ. 50 కోట్లు
లా నేస్తం – 17 కోట్లు

Also Read : Jagan Last Chance!: అప్పుల బడ్జెట్ టైం, జగన్ కు లాస్ట్ ఛాన్స్!
రైతు కుటుంబాలకు పరిహారం – రూ. 20 కోట్లు
వైఎస్సార్ నేతన్న హస్తం – రూ. 200 కోట్లు
ఈబీసీ నేస్తం – రూ. 610 కోట్లు
వైఎస్సార్ ఆసరా – రూ. 6,700 కోట్లు
వైఎస్సార్ కల్యాణమస్తు – రూ. 200 కోట్లు
జగనన్న తోడు – రూ. 35 కోట్లు
వైఎస్సార్ చేయూత – రూ. 5,000 కోట్లు
అమ్మ ఒడి – రూ. 6,500 కోట్లు
ధర స్థిరీకరణ నిధి – రూ. 3 వేల కోట్లు

వ్యవసాయ యాంత్రీకరణకు – 1,212 కోట్లు.

 

టీడీపీ స‌భ్యులు 14 మంది ఒక రోజు బ‌హిష్క‌ర‌ణ (AP Budget)

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం 14 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. బడ్జెట్ (AP Budget)సమావేశానికి అడ్డుపడుతున్నారంటూ వారిపై ఒక రోజుపాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చించాలంటూ పట్టుపట్టారు. బుగ్గన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.  ఈ క్రమంలో తెలుగుదేశం సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే అసెంబ్లీని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సంప్రదాయాలను పాటించాలంటూ హితవు పలికారు. స్పీకర్ కూడా టీడీపీ సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. అయితే టీడీపీ సభ్యులు మాత్రం తమ నిరసన కొనసాగించారు. దీంతో.. వారిని సస్పెండ్ చేయాలంటూ మంత్రి బుగ్గన సభలో ఓ ప్రతిపాదన ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన స్పీకర్ టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు.

Also Read : CM Jagan: విశాఖ నుంచే పరిపాలన : ఏపీ సీఎం జగన్