AP Budget 2025-26 : ఏపీ బడ్జెట్ సూపర్..అసలు సమస్య అదే..!

AP Budget 2025-26 : పెట్టుబడిదారులకు, ప్రజలకు విశ్వాసాన్ని కలిగించడం ముఖ్యమని విశ్లేషకులు చెబుతున్నారు

Published By: HashtagU Telugu Desk
Ap Budget 2025 26

Ap Budget 2025 26

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ఈ ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్‌(AP Budget 2025-26 )ను ప్రవేశపెట్టింది. గతంలో జగన్‌మోహన్ రెడ్డి (EX CM Jagan) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మధ్యంతర బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టగలిగారు. అయితే ఈసారి కొత్త ప్రభుత్వం తమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికల కోసం భారీగా నిధులు కేటాయిస్తూ బడ్జెట్‌ను రూపొందించింది. ఈ బడ్జెట్‌పై విమర్శలకు కూడా పెద్దగా అవకాశం లేకుండా సమతుల్యతతో ప్రతిపాదనలు చేసారు. అయితే ప్రజల్లో ఓ ప్రధాన సందేహం నెలకొంది. అదే మూడు లక్షల కోట్లకుపైగా ఆదాయాన్ని ఎలా సమకూర్చుకుంటారు ? అని.

LRS : ఎల్ఆర్ఎస్‌కు ఈ విధంగా అప్లయ్ చెయ్యండి

గత ప్రభుత్వం పాలనలో ఆదాయ వనరులు తగ్గిపోయి, కొన్ని కీలక రంగాలు క్షీణించాయి. ముఖ్యంగా పన్నుల వసూలు, పెట్టుబడులలో వెనుకబడి ఉన్నామని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక పెట్టుబడుల అహ్వానం, కేంద్రంతో అనుసంధానం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే చర్యలు తీసుకుంటోంది. అభివృద్ధి పనులు పెరిగితే, ప్రభుత్వ ఖర్చుల్లో 40 శాతం మళ్లీ పన్నుల ద్వారా ప్రభుత్వ ఖజానాకే వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని నమ్మకంతో ప్రభుత్వం ఉంది.

Location Tracking Device:  గూడ్స్, ప్యాసింజర్ వాహనాల్లో ఇక ఆ డివైజ్‌ తప్పనిసరి !

జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకోవడం ప్రభుత్వానికి పెద్ద సవాలు. గత పాలనలో ఏర్పడిన అవిశ్వాసాన్ని తొలగించి, పెట్టుబడిదారులకు, ప్రజలకు విశ్వాసాన్ని కలిగించడం ముఖ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) తన అనుభవాన్ని ఉపయోగించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచే దిశగా అడుగులు వేస్తున్నారు. పథకాల అమలు, మౌలిక వసతుల నిర్మాణం, పెట్టుబడుల పెంపుదల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచి, అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రజలు కూడా ఈ మార్పుపై ఆశాభావంతో ఉన్నారు.

  Last Updated: 01 Mar 2025, 11:40 AM IST