AP BJP : ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్‌ను బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ విడుదల చేశారు. అధ్యక్ష పదవికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు నామినేషన్ పత్రాలను ఆయనే అందజేయనున్నారు. పార్టీ కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య వాటిని పరిశీలనకు తీసుకుంటారు. నామినేషన్ల ఉపసంహరణకు అదే రోజు సాయంత్రం 4 గంట వరకు గడువు ఇచ్చారు. అన్ని ప్రక్రియల అనంతరం జులై 1న బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఎన్నిక పూర్తయిన తర్వాత నూతన అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవిలో ఎంపీ డి. పురందేశ్వరి కొనసాగుతున్నారు. కొత్త నాయకత్వం ఎవరికి లభిస్తుందనే అంశంపై పార్టీలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.
YS Jagan : సింగయ్య పడింది జగన్ కారు కిందే.. ఫోరెన్సిక్ నివేదిక