AP BJP : ఏపీలో మ‌ద్యం ఆదాయంపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని కేంద్రాన్ని కోరిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వ‌రి

ఏపీలో మ‌ద్యం ఆదాయంపై సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని ఏపీ బీజేపీ చీఫ్ పురంధ్వేశ్వ‌రి డిమాండ్ చేశారు. ఈ మేర‌కు కేంద్ర

  • Written By:
  • Updated On - October 9, 2023 / 07:39 AM IST

ఏపీలో మ‌ద్యం ఆదాయంపై సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని ఏపీ బీజేపీ చీఫ్ పురంధ్వేశ్వ‌రి డిమాండ్ చేశారు. ఈ మేర‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను క‌లిసి విన‌తిప‌త్రం ఇచ్చారు. వైసీపీ నాయకులు గతంలో ఉన్న ఓనర్ల నుండి మద్యం కంపెనీలను స్వాధీనం చేసుకున్నారని.. వారి పేర్లను మార్చారని ఆమె ఆరోపించారు. గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలు తదితర ప్రాంతాల్లో తాను చేపట్టిన మద్యం షాపుల తనిఖీల సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలను పురంధేశ్వరి ప్ర‌స్తావించారు. మద్యం విక్రయాలు అధిక ధరలకు, వినియోగదారుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే హానికరమైన పదార్థాలను ఎలా కలిగి ఉన్నాయో ఆమె లేఖ‌లో పేర్కోన్నారు.ఏపీలో మ‌ద్యం వ‌ల్ల పేద‌వారి కుటుంబాల ఆర్థిక వ్యవస్థను నాశనం అవుతుంద‌ని ఆమె తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

లక్ష రూపాయల లావాదేవీలు జరిగినట్లు రికార్డుల్లో చూపుతుండగా, డిజిటల్ లావాదేవీలు మాత్రం త‌క్కువ‌గా జ‌రిగిన‌ట్లు తేలింద‌న్నారు. తక్కువ నాణ్యత గల మద్యం సేవించడం వల్ల అనేక మరణాలు సంభవించాయని ఆమె ఆరోపించారు. మద్యం పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయానికి సంబంధించి పారదర్శకత లేదని ఆమె అన్నారు. మద్యం విక్రయాల ద్వారా రోజుకు రూ.160 కోట్లు, నెలకు రూ.4,800 కోట్లు మొత్తం ఆదాయం వచ్చినట్లు ఆమె తెలిపారు. వార్షిక ఆదాయం రూ.56,700 కోట్లు. కానీ బడ్జెట్ పేపర్లలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం రూ.20 వేల కోట్లుగా తెలిపారని పురంధేశ్వ‌రి తెలిపారు దాదాపు రూ.36,700 కోట్లు లెక్కలోకి రాలేదని, అందుకే దీనిపై సీబీఐ విచారణ అవసరమని ఆమె తెలిపారు.

Also Read:  Pawan Kalyan : తిరుపతి నుండి జనసేనాని పోటీ..?