AP Assembly : టీడీపీ వాకౌట్‌, జూలైలో విశాఖ‌కు జ‌గ‌న్ పాల‌న‌

అసెంబ్లీ బ‌డ్జెట్ (AP Assembly) స‌మావేశాలను టీడీపీ స‌భ్యులు  వాకౌట్ చేశారు. గ‌వ‌ర్న‌ర్ అబ‌ద్దాలు చెప్పిస్తున్నార‌ని అసెంబ్లీని బ‌హిష్క‌రించారు

  • Written By:
  • Updated On - March 14, 2023 / 05:43 PM IST

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ (AP Assembly) స‌మావేశాల ప్రారంభం రోజే టీడీపీ స‌భ్యులు  వాకౌట్ చేశారు. గ‌వ‌ర్న‌ర్ చేత అన్నీ అబ‌ద్దాలు(Visakha Capital) చెప్పిస్తున్నార‌ని నిర‌సిస్తూ అసెంబ్లీని బ‌హిష్క‌రించారు. చివ‌రి బ‌డ్జెట్ స‌మావేశాల్లోనైనా ప్ర‌తిప‌క్షం గొంత నొక్క‌కుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వినాలని అచ్చెంనాయుడు కోరారు. మూడు రాజ‌ధానులు అంటూ చెబుతోన్న మంత్రులు మాట‌ల‌ను గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో ఎందుకు పెట్ట‌లేద‌ని టీడీపీ నిల‌దీసింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా విశాఖ నుంచి పాల‌న ఉంటుంద‌ని ఢిల్లీ వేదిక‌గా చెప్పారు. పెట్టుబ‌డుల సద‌స్సులోనూ పారిశ్రామికవేత్త‌ల‌కు న‌మ్మ‌బ‌లికారు. ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో ఆ విషయాన్ని ఎందుకు పెట్ట‌లేద‌ని టీడీపీ స‌భ్యుడు ప‌య్యావుల కేశ‌వ్ నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం.

9 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను (AP Assembly)

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల(AP Assembly) ప్రారంభం సంద‌ర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం సభ వాయిదా పడింది. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 9 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని తీర్మానించారు. దాని ప్రకారం ఈ నెల 24 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. 16వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 19, 22వ తేదీల్లో అసెంబ్లీకి సెలవు ఉంటుంది. బీఏసీ సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ సమావేశం ప్రారంభమయింది.

Also Read : CM Jagan: విశాఖ నుంచే పరిపాలన : ఏపీ సీఎం జగన్

గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమంత్రి జగన్ ను పొగిడించారని టీడీపీ మండిప‌డింది. రాష్ట్రానికి గవర్నర్ పెద్దా? లేక సీఎం పెద్దా? అని ప‌య్యావుల ప్రశ్నించారు. సీఎంను పొగిడించి గవర్నర్ స్థాయిని తగ్గించారని దుయ్యబట్టారు. స్పీకర్ కార్యాలయంలో గవర్నర్ ను వేచి ఉండేలా చేశారని విమర్శించారు. ఇలా చేయ‌డం సభా నిబంధనలకు ఇది పూర్తిగా విరుద్ధమని అన్నారు. సుప్రీంకోర్టులో జడ్జిగా వ్యవహరించిన వ్యక్తితో ఈ ప్రభుత్వం అబద్ధాలను చెప్పించిందని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంలో రంగులు, పేర్ల పిచ్చి తప్ప మరేం లేదని నిమ్మ‌కాయ‌ల రామానాయుడు విమర్శించారు. వివిధ పథకాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పించిన లెక్కలన్నీ తప్పేనని అన్నారు. గవర్నర్ ప్రసంగంలో పోలవరం, అమరావతి (Visakha Capital) ప్రస్తావనే లేదని మండిపడ్డారు. అసత్యాలను చదవలేక గవర్నర్ ఇబ్బంది పడ్డారని చెప్పారు.

విశాఖ  నుంచే పాలన

ఏపీ క్యాబినెట్ స‌మావేశంలో(AP Assembly) జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొత్త రాజధాని గురించి ప్ర‌స్తావించారు. జులైలో విశాఖకు తరలివెళుతున్నామని మంత్రుల‌కు సంకేతాలు ఇచ్చారు. విశాఖ (Visakha Capital)నుంచే పాలన ఉంటుందని వెల్లడించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అన్నీ వైసీపీనే గెలవాలని ఆదేశించారు.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా మనవాళ్లను గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూ మంత్రివర్గ సహచరుల‌కు టార్గెట్ పెట్టారు. అంతేకాదు, మీ ప‌నితీరును గ‌మ‌నిస్తున్నానంటూ ప‌రోక్ష హెచ్చ‌రిక చేయ‌డం మంత్రివ‌ర్గంలో క‌ల‌క‌లం రేపుతోంది . సీఎం జగన్ విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని, ఏపీ రాజధాని విశాఖేనని ఢిల్లీలోనూ, ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులోనూ ప్రకటించడం తెలిసిందే. విపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ సీఎం జగన్ తమ ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టు తాజాగా క్యాబినెట్ భేటీలో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.

Also Read : AP Assembly: 14వ తేదీ నుంచి అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు