AP Assembly Session : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సెషన్ షురూ.. వైఎస్సార్ సీపీ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Jagan Chandrababu

AP Assembly Session : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలుత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన తెలపాలని విపక్ష వైఎస్సార్ సీపీ నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుంది. ఈసందర్భంగా అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై డిస్కస్ చేస్తారు. సమావేశాలు(AP Assembly Session) ఎన్ని రోజులు కొనసాగాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రేపు (మంగళవారం) ఉభయ సభల్లో చర్చ జరుగుతుంది.

We’re now on WhatsApp. Click to Join

బుధవారం నుంచి వరుసగా సభ ముందు చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ శ్వేత పత్రాలను విడుదల చేయనుంది. శాంతిభద్రతలు, పరిశ్రమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మూడు శ్వేత పత్రాలను విడుదల చేయాలని ఏపీలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు సైతం ఈసారి సభలో ప్రభుత్వం ఉంచనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం కానుంది. దీనికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సెషన్‌పై ఆసక్తి నెలకొంది.

Also Read :Hyderabad Land Deals : మూడు నెలల్లో హైదరాబాద్‌లో ఒక్కటే ల్యాండ్ డీల్.. ఎందుకలా ?

మరోవైపు బుధవారం రోజు ఢిల్లీలో నిరసన తెలపాలని వైఎస్సార్ సీపీ  నిర్ణయించింది.  ఇందుకోసం రేపటి నుంచి (మంగళవారంకల్లా) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఢిల్లీకి చేరుకోవాలని జగన్ ఆదేశాలిచ్చారు. ఈ లెక్కన రేపటి(మంగళవారం) నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే అవకాశం లేదని అంటున్నారు. అసెంబ్లీ సెషన్ జరుగుతుండగా.. ఢిల్లీలో ఆందోళన చేయడం కంటే సభలో అంశాలను ప్రస్తావిస్తే బాగుంటుందని పలువురు వైఎస్సార్ సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Also Read :Economic Survey 2024 : కాసేపట్లో బడ్జెట్ సెషన్ షురూ.. పార్లమెంటు ముందుకు ‘ఆర్థిక సర్వే’

  Last Updated: 22 Jul 2024, 09:37 AM IST