AP Assembly : వైనాట్ 23 ద‌డ, అసెంబ్లీ అరాచ‌కం అందుకే.!

ఏపీ రాజ‌కీయం(AP Assembly) ఈనెల 23వ తేదీ చుట్టూ తిరుగుతోంది.అందుకే,

  • Written By:
  • Publish Date - March 21, 2023 / 11:00 AM IST

ఏపీ రాజ‌కీయం(AP Assembly) ఈనెల 23వ తేదీ చుట్టూ తిరుగుతోంది. అందుకే, అసెంబ్లీ సాక్షిగా వైసీపీ టెంపో (YCP) క్రియేట్ చేసిందని స‌మాచారం. ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలపై దాడికి తెగ‌బ‌డ్డారు. దీంతో భావోద్వేగాల నడుమ ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఎమ్మెల్సీ స్థానాల‌ను గెలుచుకోవాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్లాన్ చేస్తున్నార‌ని వినికిడి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన చాణ‌క్యం ఫలిస్తుంద‌ని తెలుసుకున్న వైసీపీ ఏదో ఒక ర‌కంగా అభ్య‌ర్థులంద‌ర్నీ గెలిపించుకోవాల‌ని అసెంబ్లీ వేదిక‌గా రాజ‌కీయ విన్యాసాలు మొద‌లు పెట్టార‌ని సచివాల‌య వ‌ర్గాల్లోని టాక్‌.

ఈనెల 23వ తేదీ చుట్టూ ఏపీ రాజ‌కీయం(AP Assembly)

ఈనెల 23న ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(AP Assembly) పోలింగ్ జరగనుంది. ఏడు ఖాళీలు ఉండగా, 8 మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. అనూహ్యంగా టీడీపీ త‌ర‌పున పంచుమ‌ర్తి అనురాధ‌ను ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా పోటీకి నిలిపారు. ఆ రోజు నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(YCP) వాల‌కం మారింద‌ని తెలుస్తోంది. అంతేకాదు, ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో చావుదెబ్బ తిన్న వైసీపీకి ఇప్పుడు ఛాలెంజ్ గా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాల ఎఫెక్ట్‌తో వైసీపీ అలర్ట్ అయ్యింది. ఏపీ వైసీపీ ఎమ్మెల్యేల కదలికలపై ఇంటెలిజెన్స్‌ నిఘా పెట్టింది. అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేల‌పై ప్ర‌త్యేక నిఘా ఉంచారు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ని  టెన్ష‌న్ వెంటాడుతోంద‌ని..

ఆత్మ ప్రభోదానుసారం ఓటేస్తామ‌ని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామ్ నారాయణరెడ్డి ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. వాళ్లిద్ద‌రి ఓటుతో పాటు మ‌రో ఓటు ప‌డితే టీడీపీ అభ్యుర్థి పంచుమ‌ర్తి అనూరాధ గెలుస్తారు. అందుకే, మునుపెన్న‌డూలేని టెన్ష‌న్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ని వెంటాడుతోంద‌ని పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌. మొత్తం 175 మంది సభ్యులు(AP Assembly) అసెంబ్లీలో ఉన్నారు. ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరికి 25 ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలా కాకపోయినా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికి గెలుపు లభిస్తుంది.

క‌నీసం 22 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే టీడీపీ అభ్య‌ర్థి గెలుపు (YCP)

వైఎస్ఆర్‌సీపీకి 151 మంది ఎమ్మెల్యేల(AP Assembly) బలం ఉంది. ఏడుగురు అభ్యర్థులకు ఓట్లను సమానంగా పంచితే ఒక్కొక్కరికి 21 ఓట్లు లభిస్తాయి. మరో నలుగురు అభ్యర్థులకు మరో ఓటు అదనంగా వేయించ‌డానికి అవ‌కాశం ఉంది. అంటే నలుగురికి 22 ఓట్లు, ముగ్గురుకు ఇరవై ఒక్క ఓట్లు పంచుతుంది. ఇక తెలుగుదేశం పార్టీకి అధికారికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే, వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ(YCP) అభ్యర్థుల కన్నా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు ఉన్నట్లు లెక్క. కానీ ఆ పార్టీకి ఉన్న సమస్య నలుగురు ఎమ్మెల్యేలు ధిక్కరించడం. అంటే , 19 మంది ఎమ్మెల్యేలు ప్ర‌స్తుతం టీడీపీకి ఉన్నారు. క‌నీసం 22 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే టీడీపీ అభ్య‌ర్థి గెలుపు ఖాయంగా క‌నిపిస్తోంది.

Also Read : AP Assembly :TDP,YCP`బ్లాక్ డే`వార్‌!`ట్విట్ట‌ర్`డీపీల ఛేంజ్!!

మొత్తం ఏడు స్థానాలు గెలిచి తీరాల్సిందేనని కేబినెట్‌ సమావేశంలో మంత్రులకు సీఎం జగన్ హుకుం జారీ చేశారు. ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరించినట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో మార్పులు తప్పవని ఈ సందర్భంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ (AP Assembly)చేసినా, ఓటింగ్‌కు దూరంగా ఉన్నా ఫలితం తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి (YCP)టెన్ష‌న్‌.

Also Read : AP Assembly : ఏపీ అంసెంబ్లీలో ఉద్రిక్త‌త‌.. టీడీపీ – వైసీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌..?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌కీయ అప‌రచాణ‌క్యం ప్ర‌ద‌ర్శిస్తూ వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యేల‌ను(YCP) ఆక‌ర్షిస్తున్నారు. అసెంబ్లీ బులిటెన్ ప్ర‌కారం 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్నారు. కానీ, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్మే మ‌ద్దాల గిరి, విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీకి దూరంగా ఉన్నారు. వాళ్లు వైసీపీ పంచ‌న అనధికారికంగా చేరిపోయారు. అందుకే, వైసీపీ రెబ‌ల్స్ ద్వారా బాబు చ‌క్రం త‌ప్పుతున్నారు.

వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యేలు అధినేత చంద్ర‌బాబుతో ట‌చ్ లో

ప్ర‌స్తుతం వైసీపీలో రెబ‌ల్ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్మే కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి బాహాటంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని(AP Assembly) నిల‌దీస్తున్నారు. పైగా క‌నీసం 40 నుంచి 70 మంది వ‌ర‌కు ఈసారి ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాలని గ‌త రివ్యూ మీటింగ్ ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు. అందుకే, ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు చూసుకుంటున్నారు. చాలా మంది వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యేలు అధినేత చంద్ర‌బాబుతో ట‌చ్ లో ఉన్నారు. వాళ్లు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆత్మ‌ప్ర‌బోధానుసారం వేయ‌డానికి సిద్ద‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది.

Also Read : Jagan in Tirupur Sabha: నేనే హీరో.. వాళ్ళు విలన్లు! తిరువూరు సభలో జగన్

వైసీపీ, టీడీపీ రెండూ విప్ జారీ చేయ‌డం జ‌రిగింది. వ్య‌తిరేకంగా ఓటు వేస్తే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేసే దైర్యం కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(YCP) చేయ‌లేరు. అదే విధంగా టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు ఏమ‌వుతుందో, అదే వైసీపీ రెబ‌ల్స్ కు వ‌ర్తింప చేయాలి. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు చాణ‌క్యం ఫ‌లించేలా క‌నిపిస్తోంది. అందుకే, అసెంబ్లీ వేదిక‌గా వైసీపీ రాద్ధాంతం క్రియేట్ చేస్తుంద‌ని స‌చివాల‌య వ‌ర్గాల్లోని టాక్‌. అందుకే, అంద‌రూ 23వ తేదీ (AP Assembly)వైపు ఆలోచిస్తూ ఊపిరి బిగ‌ప‌ట్టుకుని చూస్తున్నారు. ఇప్ప‌టికే ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చుక్క‌లు చూపించిన టీడీపీ ఈనెల 23న మ‌రో జ‌ల‌క్ ఇవ్వ‌నుంది.

Also Read : TDP : చంద్ర‌బాబు చాణ‌క్యం, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కు జ‌ల‌క్!