YS Sharmila : తొమ్మిది ప్రశ్నలతో జగన్ కు షర్మిల మరో బహిరంగ లేఖ

YS Sharmila: ఏపీసీపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల నవ సందేహాలు పేరుతో సీఎం జగన్‌కు బహిరంగ లేఖలు రాస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా మూడో లేఖను రాశారు. అయితే ఈ సారి లేఖలో షర్మిల మద్యనిషేధం ప్రస్తావన తీసుకువచ్చారు. We’re now on WhatsApp. Click to Join. తాజా లేఖలో షర్మిల నవ సందేశాలు ఇవే.. .మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నారు. మద్యం అమ్మకాలను భారీగా పెంచి.. ఓట్లు […]

Published By: HashtagU Telugu Desk
Another open letter from Sharmila to Jagan with nine questions

Another open letter from Sharmila to Jagan with nine questions

YS Sharmila: ఏపీసీపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల నవ సందేహాలు పేరుతో సీఎం జగన్‌కు బహిరంగ లేఖలు రాస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా మూడో లేఖను రాశారు. అయితే ఈ సారి లేఖలో షర్మిల మద్యనిషేధం ప్రస్తావన తీసుకువచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజా లేఖలో షర్మిల నవ సందేశాలు ఇవే..

.మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నారు. మద్యం అమ్మకాలను భారీగా పెంచి.. ఓట్లు అడిగేందుకు ఎందుకొచ్చారు?

.మద్యంనిషేధం చేస్తామన్న హామీని ఎందుకు అమలు చేయలేదు?

.మద్యం అమ్మకాల్లో ఆదాయాన్ని రూ. 20 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లకు పెంచుకున్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగినట్టు కాదా?

.మాదకద్రవ్యాలు పట్టుబుడుతున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఎందుకుంది?

.మద్యం అమ్మకాలను ప్రజల రక్తమాంసాలతో చేస్తున్న వ్యాపారం అని మీరు అన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి?

.నకిలీ బ్రాండ్లను అమ్ముతూ ప్రజల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు?

.బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ. 11 వేల కోట్లు సేకరించాలని ఎందుకు అనుకున్నారు?

.ఆసరా, అమ్మఒడి, చేయూత పథాకాల అమలు బాధ్యతను బెవరేజెస్ కార్పొరేషన్ కు ఎందుకు అప్పగించారు?

.రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారు. ఇవి మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? అంటూ షర్మిల లేఖలో ప్రశ్నించారు.

 

మరోవైపు ఏపి ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ షర్మిల దూసుకుపోతున్నారు. మండుతున్న ఎండలు సైతం లేక్కచేయకుండా, క్షణం తీరిక లేకుండా ఆమె ప్రచారం చేస్తున్నారు.

Read Also: Toxic : యశ్ సినిమా నుంచి బాలీవుడ్ హీరోయిన్ అవుట్.. ఆ స్థానంలోకి..

  Last Updated: 04 May 2024, 12:24 PM IST