ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గత పాలనలో ఈ అంశంపై హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల ప్రకారం.. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలు కలిపి ఒక కొత్త జిల్లాగా రూపుదిద్దుకునే అవకాశముంది. దీన్ని స్థానిక ప్రజలు హర్షంగా స్వీకరిస్తున్నారు. ఎందుకంటే చాలా ఏళ్లుగా వారు ఈ జిల్లాపై కలలు కంటున్నారు. మరి ఆ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
Avoid Sugar: చక్కెర మానితే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు – ఒక్క నెల చాలు!
ఇదిలా ఉంటె తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్కాపురం పర్యటన చేపట్టారు. శుక్రవారం రూ.1290 కోట్ల వ్యయంతో జలజీవన్ మిషన్ క్రింద తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి స్వామి, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అమలు చేస్తోందని తెలిపారు.
Rainy Season : వర్షాలు పడుతుంటే వాటి దగ్గరికి అస్సలు వెళ్లకండి !!
ఇక సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “2029లో మళ్లీ అధికారంలోకి వస్తాం” అంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు బదులుగా, “మీరు ఎలా వస్తారో మేమూ చూస్తాం” అంటూ సవాల్ విసిరారు. రాజకీయాల్లో రౌడీయిజాన్ని ఎదుర్కోవాల్సి వస్తే భయపడే వాళ్లం కాదని చెప్పారు. తనపై వ్యక్తిగతంగా ఎలాంటి కోపం, కక్షలు లేవని పవన్ తెలిపారు. కానీ సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తే, అలాంటివాటిని ఎదుర్కొనేందుకు తానేంటో చూపించేందుకు తాను ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. 2019లో రెండు చోట్ల ఓడినా.. తాను తిరిగి రాజకీయంగా నిలబడినట్లు పవన్ స్పష్టం చేశారు.