ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) క్రీడాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాలను గుర్తించి, వారికి సరైన వేదిక కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా స్టేడియాల(Stadium) నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో స్టేడియం నిర్మించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ దిశగా కర్నూలు జిల్లాలో మునగలపాడు వద్ద కొత్త క్రికెట్ స్టేడియం అభివృద్ధికి నాంది పలికింది.
CBN New House : చంద్రబాబు నూతన ఇంటి గృహప్రవేశంలో పుంగనూరు ఆవులు.. వీటి ప్రత్యేక ఏంటో తెలుసా..?
శనివారం మునగలపాడులోని బాల సాయిబాబా స్కూల్ సమీప మైదానాన్ని పరిశీలించిన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, అక్కడ ఆధునిక సదుపాయాలతో కూడిన క్రికెట్ స్టేడియం నిర్మించాలని ప్రకటించారు. ఆయనతో పాటు విజయవాడ ఎంపీ, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కర్నూలు ఎంపీ నాగరాజు, ఇతర అధికారులు కూడా పరిశీలనలో పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. జూన్ 7వ తేదీలోగా ప్రణాళిక పూర్తవ్వాలని, నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
NDA Meeting : ప్రధాని సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్
అలాగే మంత్రి టీజీ భరత్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పరిసరాలను కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. అక్కడి భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ట్యాంక్ సమీపంలో ఎకో పార్క్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ విధంగా క్రీడా మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పర్యావరణ హిత కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టమవుతోంది.