Site icon HashtagU Telugu

National Highway : ఏపీలో మరో జాతీయ రహదారి..ఎక్కడి నుండి ఎక్కడికంటే

Kalwakurthy Jammalamadugu

Kalwakurthy Jammalamadugu

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల (National Highways) నిర్మాణం కేంద్ర ప్రభుత్వ సహకారంతో శరవేగంగా కొనసాగుతోంది. ముఖ్యంగా కల్వకుర్తి – జమ్మలమడుగు (Kalwakurthy – Jammalamadugu) 167K జాతీయ రహదారి ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నల్లకాల్వ నుండి వెలుగోడు వరకూ 17 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి కేంద్రం తాజాగా రూ.400 కోట్లు నిధులను కేటాయించింది. ఈ రహదారి నిర్మాణంతో తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగు వరకూ అనుసంధానం మెరుగవుతుంది.

Lifestyle : మద్యం సేవించడం మానలేకపోతున్నారా? ఈ రూల్స్ పాటిస్తే మద్యానికి దూరంగా ఉండొచ్చు!

ఈ జాతీయ రహదారి పూర్తి అయితే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే దూరం సుమారుగా 70 కిలోమీటర్ల మేర తగ్గుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రయాణం కర్నూలు మీదుగా సాగుతుండగా, ఈ రహదారి పూర్తయితే నంద్యాల మీదుగా తక్కువ సమయంలో తిరుపతికి చేరుకోవచ్చు. కేంద్రం ఈ రహదారి నిర్మాణాన్ని ఐదు ప్యాకేజీలుగా విభజించింది. మొదటి ప్యాకేజీ కల్వకుర్తి నుంచి సోమేశ్వరం వరకూ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 2వ, 3వ, 4వ ప్యాకేజీలకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. అయితే ఐదో ప్యాకేజీ అయిన నల్లకాల్వ – వెలుగోడు మధ్య రహదారి పనులు అనుమతుల వల్ల జాప్యం చెందుతున్నా, నిధుల విడుదలతో పనులు త్వరితగతిన ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

నల్లకాల్వ – వెలుగోడు రహదారి నల్లమల పులుల అభయారణ్యంలో ఉండటంతో అనుమతుల సమీకరణ కొంత సమయం తీసుకుంది. ప్రస్తుతం ఈ మార్గంలో ఒకే వరుస రహదారి ఉండగా, దానిని 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసలుగా విస్తరించనున్నారు. కేంద్రం నుంచి రూ.400 కోట్ల నిధులు విడుదల కావడం వల్ల ఈ ఐదో ప్యాకేజీ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ రహదారి పూర్తవడం వల్ల ట్రాఫిక్ సౌలభ్యం పెరగడంతో పాటు, అభివృద్ధి వేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయి.