Another Leopard: తిరుమలలో చిక్కిన మరో చిరుత

ఇక తాజాగా తిరుమలలో మరో చిరుత (Another Leopard) బోనులో చిక్కింది. అలిపిరి కాలిబాట మార్గంలో 2850వ మెట్టు వద్ద బోనులో చిరుత చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

  • Written By:
  • Updated On - September 20, 2023 / 09:30 AM IST

Another Leopard: తిరుమలలో గత కొంతకాలంగా చిరుతల సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇటీవల చిరుత దాడిలో ఓ చిన్నారి మరణించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి టీటీడీ, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల అలిపిరి నడకమార్గంలో వన్యమృగాలను పట్టుకునేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టారు. వాటి కోసం కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నాలుగైదు చిరుతలను పట్టుకున్నారు.

ఇక తాజాగా తిరుమలలో మరో చిరుత (Another Leopard) బోనులో చిక్కింది. అలిపిరి కాలిబాట మార్గంలో 2850వ మెట్టు వద్ద బోనులో చిరుత చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ బోనులోకి వచ్చి చిక్కుకుంది. శ్రీవారి ఆలయానికి వెళ్లే నడకదారిలో బుధవారం తెల్లవారుజామున మరో చిరుత బోనులో పట్టుబడింది. అయితే, చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే తాజాగా చిరుత చిక్కడం విశేషం. ఇక, చిరుతను జూపార్క్‌కు తరలించడానికి అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

దింతో ఇప్పటివరకు తిరుమలలో మొత్తం 6 పులులను బంధించారు. వీటిలో రెండు చిరుతలను విడిచి పెట్టారు. కాగా చిన్నారు లక్షితను పులి చంపిన ఘటన తర్వాత అధికారులు ట్రాప్ బోను ఏర్పాటు చేసి వాటిని బందిస్తున్నారు. మ్యాన్ ఈటర్ పులులు ఉంటే వాటిని జూకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు టీటీడీ అధికారులు.

Also Read: Two Special Trains: భక్తులకు గుడ్ న్యూస్.. న్యూఢిల్లీ- వైష్ణో దేవి కత్రా మధ్య ప్రత్యేక రైళ్లు..!

ఇప్పటివరకు ఆరు చిరుతలను బంధించినట్లు అధికారులు వెల్లడించారు. భక్తులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు సోమవారం రోజున తిరుమల-అలిపిరి మొదటి ఘాట్‌ రోడ్డులో చిరుత సంచారం కలకలం సృష్టించింది. దిగే ఘాట్‌ రోడ్డులోని 15వ మలుపు వద్ద భక్తులకు మధ్యాహ్న సమయంలో చిరుత కంట పడింది. వెంటనే అటవీశాఖ సిబ్బందికి టీటీడీ అధికారులు సమాచారం అందించారు.